April 20, 2026

పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 42 బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. స్మార్ట్ సిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్, తుడా వి. సి. గోవింద రావు, ఇండిపెండెంట్ డైరెక్టర్లు డాక్టర్ రమాశ్రీ లు ఆన్లైన్ ద్వారా పాల్గొనగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, కమిషనర్ ఎన్.మౌర్య పాల్గొని పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. తూకివాకం వద్ద స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఏర్పాటు చేస్తున్న 6మెగా వాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇంటిగ్రెటెడ్ కమాండర్ కంట్రోల్ సెంటర్ లో బాగంగా నగరంలో సిసి కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు లను త్వరగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ డాక్టర్ రామచంద్రా రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, ఈ.ఈ.రవి, తదితరులు పాల్గొన్నారు.
#Tirupati #SmartCity #DistrictCollector #DevelopmentWorks #SolarPower #SafeCity #AndhraPradesh #TirupatiNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *