March 25, 2026

Kamal Hasan sensational Decision : No contesting- DMKకి బేషరతు మద్దతు!

Kamal hasan

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయడం లేదని, అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి.. సిద్ధాంతానికే ప్రాధాన్యం

డీఎంకే పార్టీ MNMకు కేవలం రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే ఆఫర్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, ఆ స్థానాల్లో కూడా డీఎంకే గుర్తుపైనే పోటీ చేయాలన్న నిబంధన విధించింది. దీనికి కమల్ హాసన్ నిరాకరించారు. తన పార్టీకి ఉన్న ‘బ్యాటరీ టార్చ్’ గుర్తును కాపాడుకోవాలని, కనీసం 12 స్థానాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ, కూటమి ప్రయోజనాల దృష్ట్యా తన పంతాన్ని వీడి, పోటీ నుంచి తప్పుకోవడమే మేలని నిర్ణయించుకున్నారు.

ద్రవిడ మోడల్ 2.0 కోసం కమల్ ప్రచారం

వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశంలో మతతత్వ శక్తులను అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యమని కమల్ హాసన్ స్పష్టం చేశారు. “ఇది నిరసన కాదు, బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. ద్రవిడ సిద్ధాంతం గెలవాల్సిన అవసరం ఉందని, అందుకే ‘ద్రవిడ మోడల్ 2.0’ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని ప్రకటించారు. కమల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశంసించారు, దీనిని ఒక గొప్ప “త్యాగం”గా అభివర్ణించారు.

కూటమిలో మిశ్రమ స్పందన

డీఎంకే అనుసరిస్తున్న కఠినమైన సీట్ల సర్దుబాటు విధానంపై కాంగ్రెస్, సీపీఐ(ఎం) వంటి ఇతర మిత్రపక్షాల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది. అయితే, ఏఐఏడీఎంకే-బీజేపీ కూటమిని ఎదుర్కోవడానికి ఇతర ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారంతా డీఎంకేతోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ మద్దతు డీఎంకేకు అదనపు బలని చేకూర్చనుంది.

English Summary

In a dramatic turn of events, Kamal Haasan announced that his party, MNM, will not contest the Tamil Nadu assembly elections but will extend unconditional support to the DMK alliance. This decision came after disagreements over seat-sharing, as DMK offered very few seats and insisted MNM candidates use the DMK symbol.

Kamal Haasan emphasized that his priority is to defeat communal forces and ensure the success of the “Dravidian Model 2.0.” Chief Minister MK Stalin lauded this move as a magnanimous sacrifice. Kamal Haasan has committed to campaigning across the state to consolidate votes for the DMK-led alliance.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *