April 19, 2026

రేవంత్‌తో రాజగోపాల్ రెడ్డి భేటీ.. Hot discussion in congress ! వ్యూహం మార్చారా?

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అధిష్టానంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి శైలిపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి.. తాజాగా తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రితో ఆయన జరిపిన భేటీ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాజగోపాల్ రెడ్డి ‘ప్యాచప్’ వ్యూహం? చాలా కాలంగా మంత్రి పదవి ఆశిస్తున్న రాజగోపాల్ రెడ్డికి, గత విస్తరణలో అవకాశం దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఒకానొక దశలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ధిక్కార స్వరం కూడా వినిపించారు. అయితే, దూరం పెంచుకోవడం వల్ల రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేదని గ్రహించిన ఆయన, ఇప్పుడు ‘ప్యాచప్’ వైపు అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎంతో భేటీ ద్వారా తనకేం విభేదాలు లేవని కేడర్‌కు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం.

Read this article also: మంత్రి పదవి ఇవ్వకుంటే నా Taget CM.. Komati Reddy Sensational Comment

మునుగోడు ఎమ్మెల్యేపై అధిష్టానం ఆచితూచి.. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పార్టీలోని కీలక నేతలు కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి) ఉండటంతో, మూడవ వ్యక్తిగా రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడం సమీకరణాల పరంగా ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు ‘ప్రభుత్వ చీఫ్ విప్’ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది, కానీ ఆయన మాత్రం కేబినెట్ బెర్త్ కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

తగ్గడమా.. వేచి చూడడమా? “మంత్రి పదవి వస్తే మంచిది.. లేదంటే అంతకంటే పెద్ద పదవి తెచ్చుకుంటా” అని గతంలో వ్యాఖ్యానించిన రాజగోపాల్ రెడ్డి, ఇప్పుడు మెత్తబడటం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత జరగబోయే కేబినెట్ విస్తరణలో తన పేరు ఖరారు చేసుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా, మునుగోడు ఎమ్మెల్యే తాజా అడుగులు తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలకు దారితీసేలా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *