YSRCP Sentiment Strategy… నిజంగా కలిసొస్తుందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరిగి బలపడేందుకు YSR Congress Party (వైసీపీ) సెంటిమెంట్‌ను ప్రధాన ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, నాయకులకు రాజకీయపని కల్పించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకోసం భిన్నమైన స్ట్రాటజీని అనుసరించే ప్రయోగం చేస్తోంది. ప్రాంతాల వారీగా ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ, పార్టీ మళ్లీ గ్రౌండ్‌లోకి రావాలని చూస్తోంది. ముఖ్యంగా స్థానిక సమస్యలతో ప్రజల భావోద్వేగాలను కలుపుతూ రాజకీయంగా మైలేజ్ పొందాలనే లక్ష్యం కనిపిస్తోంది.
పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేర్వేరు అంశాలపై ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ వ్యూహం వల్ల ఒకవైపు స్థానిక నాయకత్వం మళ్లీ యాక్టివ్ అవుతుండగా, మరోవైపు ప్రజల్లో పార్టీ తిరిగి బలపడే అవకాశముంది. అంటే, ఇది పార్టీకి ద్వంద్వ ప్రయోజనం కలిగించే ప్రయత్నంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో మూలాపేట పోర్ట్ నిర్మాణం నిలిచిపోయిందనే అంశాన్ని వైసీపీ ప్రధానంగా తీసుకుంది. తమ పాలనలో ఈ ప్రాజెక్ట్ గణనీయంగా ముందుకెళ్లిందని, కానీ ప్రస్తుతం నిధులు అమరావతి వైపు మళ్లించబడుతున్నాయని ఆరోపిస్తోంది. “ఒక్క ప్రాంతానికే అభివృద్ధి కేంద్రీకరిస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి?” అనే ప్రశ్నతో స్థానిక సెంటిమెంట్‌ను రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కోల్పోయిన పట్టును తిరిగి సంపాదించడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ వార్త కూడా చదవండి : మంత్రులపై బాబు ఆగ్రహం… ఏపీ కేబినెట్‌లో భారీ మార్పుల సంకేతాలు!
YSRCP Sentiment Strategy : రాయలసీమలో ఎత్తిపోతలు
ఇక రాయలసీమలో ఎత్తిపోతల పథకాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వైసీపీ ఆందోళనలు చేపడుతోంది. తెలంగాణ ఒత్తిడికి లోనై సీమ ప్రజల ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ జిల్లాల వారీగా సమావేశాలు, నిరసనలు నిర్వహిస్తోంది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదనే నేరేటివ్‌ను బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. “సీమకు అన్యాయం” అనే భావోద్వేగాన్ని మళ్లీ ప్రజల్లో నాటాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తం మీద ఈ వ్యూహంలో రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి—స్థానిక నేతలను యాక్టివ్ చేయడం, ప్రజల్లో పార్టీని మళ్లీ బలంగా ప్రొజెక్ట్ చేయడం. ఇది స్ట్రాటజీగా బాగానే కనిపిస్తున్నా, వాస్తవంగా ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో మాత్రం ఎన్నికల సమయంలోనే స్పష్టమవుతుంది. సెంటిమెంట్ రాజకీయాలు తాత్కాలికంగా ఫలితాలు ఇవ్వొచ్చు కానీ, దీర్ఘకాలికంగా విశ్వసనీయతను నిలబెట్టుకోవడం కూడా అంతే కీలకం.
YSRCP’s Sentiment Strategy : Will It Really Work?
In Andhra Pradesh politics, the YSR Congress Party (YSRCP) is attempting to regain strength by turning sentiment into its primary political weapon. The party is trying to energize its cadre while simultaneously giving its leaders a clear political role. As part of this, it is experimenting with a different strategy—highlighting region-specific public issues to reconnect with the grassroots. The broader goal appears to be leveraging local emotions to regain political mileage.
As per the direction of party chief Y. S. Jagan Mohan Reddy, the party has launched issue-based agitations in North Andhra and Rayalaseema. This approach seems to serve a dual purpose: reactivating local leadership and rebuilding the party’s presence among the public. Political observers believe this could help the party regain lost ground if executed effectively.
In North Andhra, YSRCP has taken up the issue of the stalled Mulapeta Port project. The party claims that significant progress was made during its tenure, but accuses the current government of diverting funds toward Amaravati. By raising the question—“If development is concentrated in one region, what happens to the rest?”—YSRCP is attempting to trigger regional sentiment and rebuild its support base in the region where it lost ground in the last elections.
Meanwhile, in Rayalaseema, the party is focusing on lift irrigation projects. It alleges that the coalition government is compromising the interests of the region under pressure from Telangana. Through meetings, protests, and public outreach across districts, YSRCP is pushing the narrative that farmers’ concerns are being ignored. The attempt is clearly to revive the emotional narrative of “injustice to Rayalaseema.”
Overall, the strategy revolves around two key objectives—activating local leaders and reconnecting with the masses. While this sentiment-driven approach may appear politically sound, its actual impact on voters will only become clear during elections. Sentiment can deliver short-term gains, but long-term success will depend on credibility and public trust.

