March 25, 2026

WPL: ఫైనల్‌కు బెంగళూరు మహిళలు

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యుపి వారియర్స్‌ ఓటమిపాలవ్వగా.. ఈ మ్యాచ్‌లో నెగ్గిన బెంగళూరు జట్టు 12పాయింట్లతో అగ్రస్థానంతో ముగించి నేరుగా ఫైనల్‌కు చేరింది. కోటాంబిలోని బిసిఎ స్టేడియంలో గురువారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ చివరి మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 8వికెట్ల తేడాతో గుజరాత్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుపి వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 143పరుగులు చేయగా.. అనంతరం బెంగళూరు జట్టు 13.1 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 147 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు గ్రేస్‌ హార్రీస్‌ (75; 37బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్‌ స్మృతి మంధాన(54నాటౌట్‌; 27బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో బెంగళూరు జట్టు గ్రూప్‌ దశలో ఆడిన 8మ్యాచుల్లో 6విజయాలతో 12పాయింట్లతో అగ్రస్థానంతో ముగించింది. ఇక 2, 3 స్థానాలకు ఎలిమినేటర్‌ బెర్త్‌ కోసం మూడుజట్లు రేసులో నిలిచాయి. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన యుపి ఓపెనర్లు మెగ్‌ లాన్నింగ్‌ (41), దీప్తి శర్మ (55) తొలి వికెట్‌కు 49 బంతుల్లో 74 పరుగులు జోడించి శుభారంభం అందించినా.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు చెలరేగిపోయారు. స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి వారియర్జ్‌ను కుదురుకోన్విలేదు. పేసర్‌ నదినే డి క్లెర్క్‌ (4/22) వెన్ను విరిచింది. ఆఫ్‌ స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (1/27), గ్రేస్‌ హ్యారిస్‌ (2/22) కూడా అద్భుతంగా రాణించారు. హర్లీన్‌ డియోల్‌ (14), సిమ్రన్‌ షేక్‌ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. యామీ జోన్స్‌ (1), క్లో ట్రయెన్‌ (6), శ్వేతా సెహ్రావత్‌ (7), సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ డి-క్లార్‌కు దక్కింది.

స్కోర్‌బోర్డు…
యుపి వారియర్స్‌ మహిళలు : లానింగ్‌ (సి)రాధా యాదవ్‌ (బి)డి-క్లార్క్‌ 41, దీప్తి శర్మ (సి)డి-క్లార్క్‌ (బి)శ్రేయాంక పాటిల్‌ 55, అమీ జోన్స్‌ (ఎల్‌బి)డి-క్లార్క్‌ 1, హర్లిన్‌ డియోల్‌ (బి)గ్రేస్‌ హార్రీస్‌ 14, ట్రయాన్‌ (స్టంప్‌)రీచా ఘోష్‌ (బి)గ్రేస్‌ హార్రీస్‌ 6, శ్వేతా సెహ్రావత్‌ (సి)మంధాన (బి)లారెన్‌ బెల్‌ 7, సిమ్రన్‌ షేక్‌ (సి)అరుంధతి రెడ్డి (బి)డి-క్లార్క్‌ 10, ఎక్లేస్టోన్‌ (ఎల్‌బి)డి-క్లార్క్‌ 0, ఆషా శోభన (నాటౌట్‌) 0, శిఖా పాండే (నాటౌట్‌) 0, అదనం 9. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 143పరుగులు. వికెట్ల పతనం: 1/74, 2/78, 3/95, 4/103, 5/122, 6/137, 7/138, 8/143 బౌలింగ్‌: లారెన్‌ బెల్‌ 4-0-21-1, సయాలి సత్గేర్‌ 2-0-21-0, శ్రేయాంక పాటిల్‌ 4-0-27-1, అరుంధతి రెడ్డి 1-0-14-0, డి-క్లార్‌ 4-0-22-4, గ్రేస్‌ హార్రీస్‌ 3-0-22-2, రాధా యాదవ్‌ 2-0-11-0
బెంగళూరు మహిళలు : గ్రేస్‌ హార్రీస్‌ (బి)శిఖా పాండే 75, మంధాన (నాటౌట్‌) 54, జార్జియా వోల్‌ (సి)సిమ్రన్‌ షేక్‌ (బి)ఆశా శోభన 16, రీచా ఘోష్‌ (నాటౌట్‌) 0, అదనం 2. (13.1ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 147పరుగులు. వికెట్ల పతనం: 1/108, 2/143 బౌలింగ్‌: క్రాంతి గాడ్‌ 2-0-29-0, శిఖా పాండే 4-0-36-1, దీప్తి శర్మ 2.1-0-28-0, ఎక్లేస్టోన్‌ 2-0-14-0, ఆశా శోభన 2-0-24-1, ట్రయాన్‌ 1-0-15-0

#WPL2026 #RCB #SmritiMandhana #PlayBold #WomenInBlue #CricketNews #RCBvUPW #FinalBound

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *