March 23, 2026

నన్నుపోలీసులు వేధిస్తున్నారు… సెల్ఫీ విడియో.. 

  • పల్నాడు వైఎస్సార్సీపీ కార్యకర్త సూసైడ్ అటెంప్ట్

పల్నాడు, జూన్ 06 : పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు, పోలీసుల వేధింపులు భరించలేక లక్ష్మీ నారాయణ (Lakshmi Narayana) అనే వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ నారాయణకు వెంటిలేటర్ (ventilator) పై చికిత్స అందిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నం చేసే ముందు లక్ష్మీ నారాయణ ఒక సెల్ఫీ వీడియో (selfie video) విడుదల చేశారు. ఆ వీడియోలో టీడీపీ ప్రభుత్వం, పోలీసుల అరాచకాలపై తీవ్రంగా మండిపడ్డారు. “ఈ పోలీసుల అరాచకాలకు చెక్ పెట్టాలి. వైఎస్సార్సీపీ అంటేనే ప్రభుత్వం పెద్దల అండతో పోలీసులు టార్చర్ (torture) పెడుతున్నారు. నాలాగా మరొకరు బలి కాకూడదు. నేను వైఎస్సార్సీపీ కార్యకర్త అయినందునే వేధిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశాడు.

“నేనేమీ బాకీ లేకపోయినా పిడుగురాళ్లకు చెందిన టీడీపీ నాయకులు ఖలీల్ రామారావు (Khalil Rama Rao), పత్తిపాటి రామారావు, వంశీతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. డీఎస్పీ ఆఫీసుకు పిలిచి మరీ వేధించారు. ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *