
ప్రాణాలతో బయటపడ్డ 24 మంది సిబ్బంది
ఓడిశా తీరాన్ని ఆనుకుని ఉన్న సముద్రంలో ఆదివారం తెల్లవారుఝామున ఒక్కసారిగా ఓ భారీ వాణిజ్య ఓడ మునగిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓడలోని ఒక హోల్డులోకి నీరు ప్రవేశించడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. అయితే అధికారులు సకాలంలో స్పందించడం వలన 24 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించగలగారు.
భారత తీరరక్షణ దళం (ICG) మరియు నౌకాదళం చాకచక్యంతో ఈ విపత్తు నుంచి ప్రాణ నష్టం కలుగకుండా చేసింది.ప్రమాద సమయానికి ఓడపై ఉన్న ముగ్గురు కీలక సిబ్బంది – కెప్టెన్, చీఫ్ ఇంజినీర్, సెకండ్ ఇంజినీర్ –ను INS సుజాత రక్షించింది. మిగిలిన 21 మంది సిబ్బంది అంతకు ముందే భద్రంగా బయటకు వచ్చారు.
ఐసీజీ ప్రకారం, ఓడ ఒక వైపుకు జారిపోవడంతో కొన్ని కంటైనర్లు నీళ్లలోకి పడిపోయాయి. ప్రస్తుతం ఎంత మేర నష్టం సంభవించిందన్నదానిపై అంచనా వేయడం (risk assessment) జరుగుతోంది. రక్షణ చర్యలతో పాటు ఓడను మళ్లీ నిలిపేందుకు సేల్వేజ్ ఆపరేషన్‌ను కూడా ప్రారంభించారు. ఓడ స్థిరంగా ఉండేలా చేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు, ఐసీజీకి చెందిన ఓడలు, విమానాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ సమన్వయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
Odisha Ship Accident, Indian Coast Guard, Cargo Vessel Capsize, INS Sujata Rescue, Salvage Operation, Risk Assessment, Navy Rescue Operation, Marine Disaster India, Container Loss at Sea, Odisha Coast News