
- బీఎన్పీ–యునూస్ భేటీ, మూడు ముఖ్య డిమాండ్లు
- ఎన్నికలు, మార్పులు, మంత్రివర్గ పునర్నిర్మాణం
బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఎన్నికల సమీపంతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) కీలకంగా దూకుడు పెంచింది. మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా నేతృత్వంలోని బీఎన్పీ, మధ్యంతర ప్రభుత్వ ప్రధానిగా ఉన్న మహమ్మద్ యునూస్‌ను అధికారికంగా కలుసుకొని, మూడు కీలక డిమాండ్లు వెల్లడించింది:
2025 డిసెంబరు లోగా జాతీయ ఎన్నికలు నిర్వహించాలి
వివాదాస్పద సలహాదారులను తొలగించాలి
కొత్త సలహాదారుల మండలిని ఏర్పాటు చేయాలి
శనివారం సాయంత్రం జమునా నివాసంలో ప్రధాన సలహాదారుడైన యునూస్‌తో సమావేశమైన బీఎన్పీ స్థాయీ కమిటీ సమావేశమయ్యింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకున్న పరిస్థితులపై చర్చిర్చించారు. తరువాత బిఎన్పీ సభ్యుడు ఖాండేకర్ ముశారఫ్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇన్నాళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్ట్‌లను వేగంగా పూర్తి చేసి, డిసెంబరు వరకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరామనితెలిపారు.
వివాదాస్పద సలహాదారులపై తీవ్ర అభ్యంతరం
ప్రస్తుత సలహాదారుల మండలిలో స్టూడెంట్స్ అగెయినెస్ట్ డిస్క్రిమినేషన్ (SAD) ప్రతినిధులుగా ఉన్న మఫూజ్ ఆలమ్, ఆసిఫ్ మహ్మూద్ భుయాన్‌లను బీఎన్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో అవామీ లీగ్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు నడిపిన ఉద్యమంలో SAD నేతల ప్రమేయం ఉండటమే ఇందుకు కారణం. వీరిద్దరికి యువజన, క్రీడా మరియు సమాచార మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించారు. మరో సలహాదారు మాజీ రాయబారి ఖలిలుర్ రెహమాన్ యునూస్‌కు జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్నారు. వీరిని తొలగించాలని బీఎన్పీ గతంలో కూడా లిఖితపూర్వకంగా డిమాండ్ చేసింది. ఇలా నాయకుల మధ్య సమన్వయం లోపం, పరస్పర వ్యతిరేకత పతాక స్థాయికి చేరింది.
హుస్సేన్ మాట్లాడుతూ, ఎన్నికలకు తగినదైన రోడ్‌మ్యాప్‌ను యునూస్ ప్రకటించాలని, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా కొత్త సలహాదారుల మండలి ఏర్పాటవాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యం ప్రస్తుతం మూడింటిపై ఉందని అన్నారు. వాటిలో మొదటిద ఎన్నికల సంస్కరణలు, మాజీ ప్రధానమంత్రి హసీనా పాలనకు సంబంధించిన కేసులు, అలాగే స్వేచ్ఛాయుత ఎన్నికలు ప్రధాన డిమాండ్లుగా తాము ముందుకు తీసుకువచ్చామని చెప్పారు.
ఇంతలో జమాత్-ఇ-ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహ్మాన్ కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. సమగ్ర సంస్కరణలు పూర్తయితే 2026 ఫిబ్రవరిలో, లేదంటే రంజాన్ తర్వాత ఎన్నికలు నిర్వహించవచ్చునని పేర్కొన్నారు. అలాగే, సంస్కరణలు మరియు ఎన్నికల కోసం విడివిడిగా రెండు రోడ్‌మ్యాప్‌లు అవసరమని కూడా అన్నారు.
ఇంకొవైపు, యునూస్ మద్దతుతో ఏర్పాటు అయిన నేషనల్ సిటిజన్ పార్టీ (NCP), ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ఒత్తిడి తీసుకువస్తోంది. కానీ, బీఎన్పీ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీఎన్పీ అభిప్రాయం ప్రకారం, అవామీ లీగ్ తుడిచిపెట్టిన తర్వాత జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా నిలిచిన పార్టీగా తామే ఉన్నామని పేర్కొంది.
యునూస్ మీడియా కార్యదర్శి షఫీకుల్ ఆలమ్ ప్రకారం, 2025 డిసెంబరు నుంచి 2026 జూన్ మధ్యలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని యునూస్ అన్ని పార్టీలకు తెలియజేశారు. ఈ సమయం జమాత్ మరియు ఎన్సీపీలకు కూడా అనుకూలంగా ఉందని వెల్లడించారు.
ఈ భేటీ జరిగిన కొద్ది గంటల తర్వాతే యునూస్ నేతృత్వంలోని సలహాదారుల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది. యునూస్ రాజీనామా చేయడం లేదని, ఆయన కొనసాగుతారని అందులో స్పష్టం చేశారు.