వాళ్లది ఫ్యాక్షన్.. మనది ఫైటర్ జెట్! ఏఎమ్‌సీఏ సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!
AMCA PROJECT PUTTAPARTHI
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా జరిగిన ఐదవ తరం యుద్ధ విమానాల (AMCA) ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. Nara Lokesh Speech AMCA Project Puttaparthi 2026 వివరాల ప్రకారం.. గత ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్‌డీఏ కూటమిని 14కు 14 సీట్లు గెలిపించి కంచుకోటగా నిలిపినందుకు ఇక్కడి ప్రజలకు తాము ఇస్తున్న ‘రిటర్న్ గిఫ్ట్’ ఈ ఏఎమ్‌సీఏ ప్రాజెక్టు అని లోకేష్ పేర్కొన్నారు. నాడు కరువు నేలపై ‘కియా’ కార్లను పరిగెత్తించిన చంద్రబాబు.. నేడు అదే పుణ్యభూమిపై ఫైటర్ జెట్లు ఎగిరేలా చేస్తున్నారని కొనియాడారు.
పుట్టపర్తిలో ఏఎమ్‌సీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్! ఈ వార్తను కూడా చదవండి
75 ఏళ్ల కుర్రాళ్ల స్పీడ్ – డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్: ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఐరన్ మ్యాన్‌గా అభివర్ణించిన లోకేష్.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్’ సర్కార్ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు నాయుడులను 75 ఏళ్ల కుర్రాళ్లుగా అభివర్ణిస్తూ.. వారి పనితీరు వేగం ముందు 25 ఏళ్ల యువకులు కూడా సరిపోరని అన్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, అమరావతి, పోలవరం నిధులు, కర్నూలు హైకోర్టు బెంచ్ వంటివన్నీ ఈ ‘నమో’ (నాయుడు-మోదీ) జోడీ వల్లే సాధ్యమయ్యాయని, గత 23 నెలల్లో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంటే ఏంటో ప్రపంచానికి చూపించామని స్పష్టం చేశారు.
ఫ్యాక్షన్ వర్సెస్ ఫైటర్ జెట్: బెంగళూరును హెచ్‌ఏఎల్ (HAL) ఎలా అభివృద్ధి చేసిందో, ఏఎమ్‌సీఏ ప్రాజెక్టు పుట్టపర్తిని అలాగే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని, దీనివల్ల స్థానిక యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయని లోకేష్ భరోసా ఇచ్చారు. తన ప్రసంగం ముగింపులో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేస్తూ లోకేష్ మార్క్ పంచ్‌లు వేశారు. “వాళ్లది ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్.. మనది ఫైటర్ జెట్ బ్యాక్‌గ్రౌండ్; వాళ్లది కిడ్నాప్ బ్యాక్‌గ్రౌండ్.. మనది కియా బ్యాక్‌గ్రౌండ్.. రెండిటికీ చాలా తేడా ఉంది.. అర్థమైందా రాజా!” అంటూ నారా లోకేష్ వేసిన చురకలు సభలో పెద్ద ఎత్తున ఈలలు, కేకలతో హోరెత్తించాయి.
News Article (English)
Puttaparthi: Andhra Pradesh Minister for IT, Electronics, and Education, Nara Lokesh, delivered an electrifying address during the foundation stone ceremony of the mega stealth fighter jet project. Highlighting the core elements of the Nara Lokesh Speech AMCA Project Puttaparthi 2026, the young leader termed this ₹15,803-crore defense infrastructure as a ‘Return Gift’ to the people of undivided Anantapur district for sweeping all 14 assembly seats for the NDA coalition in the elections. He credited Chief Minister Chandrababu Naidu for bringing Kia cars to this drought-prone region in the past and now enabling advanced fighter jets to take off from the same soil.
The Power of ‘NaMo’ and the 75-Year-Old Youth: Lauding Union Defence Minister Rajnath Singh for his iron-willed leadership during Operation Sindhoor, Lokesh stated that AP is being driven by a “Double-Engine Bullet Train Government.” In a lighter yet impactful note, he described PM Narendra Modi, Rajnath Singh, and Chandrababu Naidu as “75-year-old youngsters” whose governance speed easily outpaces 25-year-olds. He highlighted mega investments secured within 23 months, including the Google Data Center and ArcelorMittal projects, attributing them to the powerful synergy of the NaMo (Naidu-Modi) combination that redefined the ‘Speed of Doing Business’ in India.
Faction vs Fighter Jet Politics: Lokesh emphasized that just as HAL transformed Bengaluru over the decades, the AMCA project, spearheaded by DRDO and ADA, will turn Puttaparthi into a global defense manufacturing hub, generating thousands of high-tech jobs. Concluding his speech with political satire aimed at the opposition YSRCP, Lokesh delivered sharp punchlines that energized the crowd. “Their background is factionalism, ours is fighter jets; their background is kidnapping, ours is Kia. There is a world of difference between the two—Arthamayinda Raja (Got it, my king?),” Lokesh remarked, drawing massive cheers from the gathering.
#NaraLokeshSpeechAMCAProjectPuttaparthi2026 #NaraLokesh #AMCAProject #Puttaparthi #ChandrababuNaidu #RajnathSingh #AnantapurDevelopment #FighterJetBackground #KiaMotors #APDefensreHub2026
పుట్టపర్తిలో ఏఎమ్‌సీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్! ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
