April 21, 2026

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్: 2029లో తేల్చుకుందాం!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూరుపల్లిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. CM Revanth Reddy KCR పై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, కేసీఆర్‌కు 2029 ఎన్నికల సవాలు విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సుస్థిరమని, ప్రతిపక్ష హోదాను కూడా లేకుండా చేస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

కేసీఆర్ పాలనను ‘పాపాల భైరవుడి పాలన’గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తమ విధానమని ఆయన తెలిపారు.

ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారిని వంద మీటర్ల లోతున పాతరేస్తుందని ఆయన ఘాటుగా స్పందించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


In a massive public meeting held in Nasturupalli, Jayashankar Bhupalpally district, Chief Minister Revanth Reddy launched a scathing attack on former CM KCR. The statements made by CM Revanth Reddy KCR have become a hot topic in political circles.

During the release of the Rythu Bharosa funds, CM Revanth challenged KCR for the 2029 elections. He asserted that the Congress administration is stable and warned that the opposition party might even lose its official status.

CM Revanth Reddy’s Challenge to KCR

Describing KCR’s regime as a “reign of sins,” Revanth Reddy emphasized that the people of Telangana desire development and progress. He highlighted that the Congress government prioritizes farmers’ welfare and remains committed to building irrigation projects as part of its core policy.

Rebutting the allegations made by opposition leaders, he sharply remarked that the Congress party would bury them deep in the next elections. Revanth Reddy expressed confidence that the Congress party would remain in power in Telangana until 2034.

#CMRevanthReddyKCR #TelanganaPolitics #CongressGovernment #RythuBharosa #RevanthReddy #KCR #TelanganaNews #PoliticalChallenge #NasturupalliSabha #TelanganaDevelopment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *