
న్యూఢిల్లీ, జూన్ 8: పాకిస్తాన్ దేశాన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు ఇండియా కారణంగా నీటి కొరత మరోవైపు బలోచిస్తాన్ వేర్పాటు వాదులు. ఇంకొకవైపు తెహ్రికీ తాలిబాన్ పాకిస్తాన్ దాడులు.. ఆ దేశ పాలకలకు, సైన్యానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ బిఎల్ఏ అయితే శిరోభారంగా మారుతోంది. ఆ సంస్థ అత్యంత ఆధునికమైన ఆయుధాలను చేతబూని పాకిస్తాన్ సైన్యానికి సవాల్ విసురుతోంది. ఆ వేర్పాటు వాద సంస్థకు ఆయుధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి? నిధులు ఎవరిస్తున్నారనే పెద్ద చర్చీనీయాంశంగా మారింది .
బలోచ్ విమోచన సేన (Baloch Liberation Army – BLA) వల్ల షెహబాజ్ ప్రభుత్వం గట్టి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల బలోచ్ యోధులు పాకిస్తాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffer Express) రైలు మీదకు దాడి చేసి 100 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను బందీలుగా తీసుకున్నారు. ఈ దాడి సమయంలో వారు ఆధునిక ఆయుధాలతో కనిపించారు. అసలే పేద ప్రాంతం, నిర్లక్ష్యం కాబడిన ప్రాంతం.
ఆ ప్రాంతంలో జనం చేసే పోరాటానికే పెద్ద ప్రాధాన్యత ఉండదని అందరూ అనుకుంటారు. కానీ, ఆ సంస్థ ప్రస్తుతం అత్యాధునిక ఆయుధాలు కలిగి ఉండడం ఆశ్చర్య కలుగుతోంది. పాకిస్తాన్ తో పాటు ఇరుగుపొరుగుదేశాలకు అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. కానీ, వారికి ఆయుధాలు నిధులు వచ్చే అవకాశాలున్న ప్రదేశాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
బలోచ్ యోధులు ముఖ్యంగా ఇరాన్ మరియు ఆఫ్గానిస్థాన్ బ్లాక్ మార్కెట్ల (black markets) నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారు. తెహ్రికీ తాలిబన్ పాకిస్తాన్ వీరికి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.
2021లో అమెరికా ఉన్నపళంగా ఆఫ్గానిస్థాన్‌ను విడిచిపెట్టినప్పుడు, అక్కడ తమ అత్యాధునిక ఆయుధాలను వదిలి వెళ్లింది. వాటిలో కొన్ని బలోచ్ సైనికుల చేతికి చేరినట్టు విశ్లేషణ.
అమెరికన్ ఆయుధాలు (American weapons)తో పాటు, రష్యన్ ఆయుధాలూ (Russian weapons) ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
వీరి వద్ద M240B machine gun, M16A4 rifle, RPG-7 launcher వంటి ప్రాణాంతక ఆయుధాలు ఉన్నాయి. నిధులు ఎక్కడ నుంచి సమకూరుతున్నాయనే విషయంలో కొంత స్పష్ట రావాల్సి ఉంది. బిఎల్ఏకు చెందిన కొందరు విదేశాలలో ఉన్నారు. వారు పెద్ద ఎత్తున నిధులు రాబడుతున్నట్లు సమాచారం.
బలోచిస్తాన్ వేర్పాటువాదులు తమ స్వతంత్రత కోసం పోరాడుతున్నారు. వీరి స్థావరాలు ప్రధానంగా పర్వత ప్రాంతాల్లో ఉన్నాయని సమాచారం. స్థానిక ప్రజల నుండి కూడా వీరికి మద్దతు లభిస్తున్నట్లు చెప్పబడుతోంది.
ఈ విషయాలపై పాకిస్తాన్ ప్రభుత్వానికి గట్టి ఆందోళన నెలకొన్నది. దేశ భద్రతకు ఇది తీవ్రమైన సవాలుగా మారుతోంది.