AP Delimitation 2026: భారీ మార్పులకు రంగం సిద్ధం
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం రావడంతో దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ బిల్లు అమలైతే దేశంలోని మొత్తం లోక్‌సభ స్థానాలు 543 నుంచి 850కి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామంలో ప్రధానంగా దృష్టి ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175గా ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 263కు పెరగవచ్చు. అంటే సుమారు 88 కొత్త అసెంబ్లీ సీట్లు చేరే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అంశంగా మారనుంది. మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే సుమారు 87 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది.
Read this article also : లోక్‌సభ సీట్ల పెంపు: విస్తరణ కంటే ఎక్కువ — శక్తి పునర్విభజన
లోక్‌సభ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 25 సీట్లు 37 లేదా 38కి పెరగవచ్చని అంచనా. అదే 33% మహిళా రిజర్వేషన్ అమలైతే 12 నుంచి 13 ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. ఈ పెరుగుదలతో ఏపీ జాతీయ రాజకీయాల్లో మరింత ప్రభావం చూపే స్థాయికి చేరే అవకాశం ఉంది.
రిజర్వేషన్లు, రాజకీయ ప్రభావం
డీలిమిటేషన్ తర్వాత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో 29 అసెంబ్లీ సీట్లు ఎస్సీలకు, 7 సీట్లు ఎస్టీలకు రిజర్వ్ ఉన్నాయి. లోక్‌సభలో తిరుపతి, చిత్తూరు, బాపట్ల, అమలాపురం ఎస్సీ రిజర్వ్ కాగా, అరకు ఎస్టీ రిజర్వ్‌గా ఉంది. కొత్త పునర్విభజన తర్వాత ఈ సంఖ్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఇక మంత్రివర్గ విస్తరణ కూడా ఈ మార్పులతో అనుసంధానమై ఉంది. ప్రస్తుతం ఉన్న 26 మంది మంత్రుల సంఖ్య 39 వరకు పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది అధికార పార్టీలకు మరింత రాజకీయ సమతుల్యత సాధించే అవకాశాన్ని ఇస్తుంది.
English Version
AP Delimitation 2026: Massive Political Restructuring Ahead
The Central Government is moving forward with the Delimitation Bill, expected to be introduced in Parliament on April 16. As per proposals, the total Lok Sabha seats across India may increase from 543 to 850. This development has brought sharp focus on Andhra Pradesh and its future political landscape.
Currently, Andhra Pradesh has 175 Assembly seats, which are expected to rise to around 263 after delimitation—an increase of nearly 88 seats. Similarly, Lok Sabha seats may increase from 25 to 37 or 38. With 33% women reservation, about 12–13 MP seats and nearly 87 Assembly seats could be reserved for women.
SC/ST representation is also expected to rise. Existing reserved constituencies may increase in number, reshaping electoral demographics. Additionally, the state cabinet size could expand from 26 to 39, indicating major administrative changes.
Overall, delimitation is set to redefine Andhra Pradesh’s political power and representation at both state and national levels.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
