
- భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు
పాకిస్తాన్ మరోసారి ఉగ్రవాద సూత్రధారులకు వేదికగా మారినట్టుగా అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చే పాకిస్తాన్, వాస్తవానికి అంతర్వాడుగా భారత్‌పై ద్వేషాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలకు వేదికగా కనిపిస్తోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి లాహోర్‌లో జరిగిన యూమ్-ఎ-తక్బీర్ ర్యాలీలో పాల్గొని భారత్‌ను టార్గెట్ చేస్తూ విపరీతమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
లాహోర్‌కు హాజరైన ఉగ్రవాది సైఫుల్లా కసూరి
భారత దేశం నిర్వహించిన అణు పరీక్షల వార్షికోత్సవాన్ని వ్యతిరేకిస్తూ, పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) ఆధ్వర్యంలో లాహోర్ నగరంలో యూమ్-ఎ-తక్బీర్ పేరిట భారత్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లష్కరే తోయిబా (LET) ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్, పహల్గాం దాడికి మాస్టర్మైండ్‌గా గుర్తింపు పొందిన సైఫుల్లా కసూరి అలియాస్ ఖాలీద్ పాల్గొనడం కలకలం రేపుతోంది.
పంజాబ్ స్పీకర్‌తో కలిసి వేదికపై
ఈ కార్యక్రమానికి పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్తో, హఫీజ్ సయీద్ కుమారుడు తల్షా సయీద్ కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ప్రసంగంలో కసూరి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “పహల్గాం దాడికి మాస్టర్మైండ్‌గా పేరొందిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా నాకు గుర్తింపు వచ్చింది,” అంటూ గర్వంగా పేర్కొన్నాడు.
వైరల్ అయిన కసూరి వీడియో
ఈ స్పీచ్‌ను ఓ వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పాకిస్తాన్ మతకటువాద వర్గాలు వైరల్ చేస్తున్నాయి. ప్రసంగంలో భారత వ్యతిరేక నినాదాలే కాక, చనిపోయిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్‌లో ఆసుపత్రి, రోడ్డు నిర్మాణం చేయిస్తానని ప్రకటించడం తీవ్ర దుస్థితికి నిదర్శనం.
ఎల్‌ఈటీపై నిషేధం ఉండగానే కార్యకలాపాలు
లష్కరే తోయిబాపై అధికారికంగా నిషేధం అమలులో ఉన్నా, పీఎంఎంఎల్ ముసుగులో ఎల్‌ఈటీ కార్యకలాపాలు కొనసాగుతున్నట్టు సమాచారం. కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) కార్యకలాపాల్లో సైతం కసూరి కీలకపాత్ర పోషిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.