May 17, 2026

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం

TRUMPH

TRUMPH

చైనా-తైవాన్‌ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ కోసం తాము చైనాతో యుద్ధానికి సిద్ధంగా లేమని స్పష్టం చేస్తూ, భౌగోళిక పరిస్థితులు చైనాకే అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల బీజింగ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరిన అనంతరం ఆయన ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తైవాన్ రక్షణ అంశం చాలా క్లిష్టమైనదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా భారీ సైనిక శక్తి కలిగిన పెద్ద దేశమని, తైవాన్ చాలా చిన్న ద్వీపమని ఆయన గుర్తుచేశారు. “తైవాన్ చైనా ప్రధాన భూభాగానికి కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అమెరికా అక్కడి నుంచి 15 వేల కిలోమీటర్ల (9,500 మైళ్లు) దూరంలో ఉంది. ఒక దేశ స్వాతంత్య్రం లేదా స్వయంప్రతిపత్తి కోసం మేము అంత దూరం ప్రయాణించి, చైనా లాంటి శక్తిమంతమైన దేశంతో యుద్ధం చేయలేం. అందుకే చైనా, తైవాన్ రెండు దేశాలూ సంయమనం పాటించాలి” అని ట్రంప్ సూచించారు.

చైనా పర్యటనలో అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జరిపిన చర్చల్లో ఎక్కువ సమయం తైవాన్ అంశంపైనే గడిచిందని ట్రంప్ వివరించారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, అమెరికా-చైనాలు ప్రపంచాన్ని నడిపించే రెండు గొప్ప శక్తులు (జీ-2) అని ఆయన అభివర్ణించారు. అయితే, గత అమెరికా అధ్యక్షుల తప్పుడు విధానాల వల్లే తైవాన్ నేడు గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మారిందని, అమెరికా చిప్స్ పరిశ్రమను తైవాన్ దొంగిలించిందని ట్రంప్ మండిపడ్డారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తైవాన్‌పై చైనా దాడి చేయకపోవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


చెత్తబుట్టలో చైనా బహుమతులు: భద్రతా కారణాలతోనేనా?

ట్రంప్ చైనా పర్యటన ముగింపులో ఒక ఆసక్తికరమైన ఘటనా చోటుచేసుకుంది. రెండు రోజుల పర్యటనలో చైనా అధికారులు ట్రంప్‌తో పాటు ఆయన బృందానికి, పారిశ్రామిక దిగ్గజాలకు అందించిన బహుమతులు, మెమొరాబిలియా, ఇతర వస్తువులన్నింటినీ అమెరికా సిబ్బంది ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలోని చెత్తబుట్టలో పడేశారు.

ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ పూల్ ప్రతినిధి ఎమిలీ గూడిన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “బీజింగ్ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే ముందు అమెరికా భద్రతా సిబ్బంది చైనా ఇచ్చిన ప్రతి వస్తువును సేకరించి చెత్తబుట్టలో వేశారు. చైనా వస్తువులేవీ విమానంలోకి అనుమతించకూడదనేది కఠినమైన ఆదేశం” అని ఆమె పేర్కొన్నారు. చైనా అధికారులు ఇచ్చిన గిఫ్ట్‌లు, బ్యాడ్జ్‌లు, పిన్‌లలో గూఢచర్యానికి లేదా హ్యాకింగ్‌కు సంబంధించిన నిఘా పరికరాలు (వైర్‌ట్యాపింగ్ డివైజ్‌లు) ఉండే అవకాశం ఉందనే అనుమానంతోనే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ పర్యటన పొడవునా అమెరికా బృందం తీవ్రమైన సైబర్ భద్రతా జాగ్రత్తలు పాటించింది. ట్రంప్‌తో పాటు ఎలోన్ మస్క్, జెన్సన్ హువాంగ్ వంటి పారిశ్రామిక ప్రముఖులు కూడా తమ వ్యక్తిగత ఫోన్లను అమెరికాలోనే వదిలిపెట్టి, చైనాలో కేవలం హ్యాకింగ్ చేయడానికి వీల్లేని తాత్కాలిక ‘బర్నర్ ఫోన్లను’ మాత్రమే ఉపయోగించారు. బహిరంగంగా ఇరు దేశాల నేతలు స్నేహపూర్వకంగా కనిపించినప్పటికీ, తెరవెనుక ఇరు దేశాల మధ్య ఉన్న తీవ్రమైన అవిశ్వాసానికి ఈ భద్రతా చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.


US-China Relations: Trump’s Big Statement On Taiwan Conflict

U.S. President Donald Trump has made a major statement on the China-Taiwan conflict, asserting that the U.S. will not go to war with Beijing over Taiwan. Trump highlighted that geographical and strategic conditions heavily favor China in this long-standing territorial dispute. Speaking to Fox News in an interview after concluding his two-day state visit to Beijing, Trump described the Taiwan issue as incredibly complex.

Trump noted that China is an immense, powerful nation, while Taiwan is a relatively small island. “Taiwan is just 95 kilometers away from mainland China, whereas the United States is 15,000 kilometers away. That is the real challenge. We cannot travel 15,000 kilometers to fight a war with a major superpower for another island’s independence. Both sides must exercise restraint and cool it,” Trump stated.

The U.S. President revealed that a significant portion of his bilateral discussions with Chinese President Xi Jinping centered around Taiwan. Despite the extensive talks, Trump maintained that the fundamental U.S. stance remained neutral, though he suggested arms sales could be used as a bargaining chip. He also criticized previous U.S. administrations for allowing Taiwan to dominate the semiconductor hub, claiming they “stole” the American chip industry. Trump confidently added that China would likely not attack Taiwan during his presidency, though it remains a threat if he is not in office.


Chinese Diplomatic Gifts Dumped In Trash Due To Spying Fears

An unprecedented scene unfolded at the Beijing airport as President Donald Trump’s delegation prepared to depart for Washington. All diplomatic gifts, souvenirs, and badges presented by the Chinese hosts to the American delegation, including high-profile tech executives, were systematically thrown into trash cans right outside the presidential aircraft, Air Force One.

The dramatic security protocol was reported by Emily Goodin, the White House correspondent for the New York Post. “Before boarding Air Force One in Beijing, members of the U.S. delegation discarded everything provided to them by Chinese hosts into the garbage bin. Every gift, credential badge, and pin was collected. The directive was absolute—nothing made in China was allowed on board,” Goodin revealed. The drastic measure was reportedly driven by strict counterintelligence policies to eliminate risks of cyber espionage, hidden bugs, or electronic tracking devices.

The intense security measures extended throughout the entire two-day trip. High-profile delegates left their personal smartphones in the U.S. and relied entirely on highly secure, temporary “burner phones.” While the public optics of the Trump-Xi summit appeared cordial, the literal dumping of diplomatic gifts underscores the profound geopolitical mistrust and technological cold war currently defining US-China Relations.

#USChinaRelations #DonaldTrump #XiJinping #TaiwanConflict #AirForceOne #ChinaGifts #EmilyGoodin #FoxNews #Semiconductors #SpyingFears

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *