March 23, 2026

చెవిరెడ్డి విడుదలపై మొక్కులు చెల్లించుకున్న ప్రసాద్ రెడ్డి

లేని లిక్కర్ కేసులో 8 నెలల పాటు అక్రమంగా జైలులో నిర్భంధించిన తమ నాయకుడు క్షేమంగా విడుదల కావడంతో వైసిపి నేత మొక్కులు చెల్లించుకున్నాడు. కోతలకు చెందిన వైసీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షుడు విరూపాక్షి ప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి విడుదల కావడంతో తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు. మంగళవారం ఉదయం తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో ఆయన్ను కలసి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ప్రజానేతకు ప్రజలే అండగా నిలిచారని, వారు చేసిన పూజల ఫలితంగా తమ నాయకుడు క్షేమంగా బయటకు రావడంతో శ్రీవారికి మొక్కులు చెల్లించానని ఆయన అన్నారు.
#ChevireddyBhaskarReddy #YSRCP #Tirumala #Tirupati #Politics #YCPNews #VowsFulfilled #AndhraPolitics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *