March 23, 2026

జూన్ 5న ఘనంగా వనమహోత్సవం

  • కోటి మొక్కల నాటే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాచరణ
  • ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్
  • అవగాహన కార్యక్రమాలు, పోటీలు

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5న రాష్ట్ర వ్యాప్తంగా భీభత్సంగా వనమహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

ఈ రోజు ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్య ఉద్దేశ్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని రాష్ట్రస్థాయిలో ప్రారంభిస్తారు.

ఈ వనమహోత్సవంలో జిల్లాల వారీగా ఇన్ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

ప్రతి నియోజకవర్గం, మండల కేంద్రం, గ్రామస్థాయిలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ వన కార్యక్రమాన్ని విజయవంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇందుకు తోడు, ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు, విద్యార్థుల కోసం వివిధ పోటీలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి సోషల్ మీడియా వేదికగా సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రెండు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *