March 27, 2026

“క’ అంటే ఏంటి? చెప్పుకోండి చూద్దాం..!!

 

ka : ‘క’ అంటే ఏంటి? విచిత్రంగా ఉందే.. ‘క’ భాష.. ఈ భాషా ప్రయోగాలన్ని ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయాయిగా, మరేంటి? అందుకే ‘సినిమా చూడండి చివర్లో మీకే తెలుస్తుంది’అంటున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఇలాంటి కథ, ఇటువంటి క్లయిమాక్స్‌ ఇంతకుముందు చూసుండరు. అందుకే.. సినిమా చూసి మీరు కొత్తగా ఫీల్‌ కాకుంటే సినిమాలు చేయడం మానేస్తానని ధీమా చెబుతున్నాడు ఈ చిన్నోడు.

Kiran Abbavaram హీరోగా రూపొందిన విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘క’ సినిమా. ఈ సినిమాలో నయన్‌సారిక, తన్వీరామ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇద్దరు దర్శకులు ఒకరు సుజీత్‌, రెండో వ్యక్తి సందీప్‌ ఇద్దరూ కలిసి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఈ నెల 31న ప్రేక్షకుల ముందు రానున్న సినిమాపై చిత్ర యూనిట్ గంపెడు ఆశలు పెట్టుకుని ఉంది.

ఈ సందర్భంగా సోమవారం కిరణ్‌ అబ్బవరం విలేకరులతో మాట్లాడారు. ఇది సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథ.సినిమా సస్పెన్స్‌తో కథ సాగుతుంది. 1977లో కృష్ణగిరి అనే ఊరిలో పనిచేసే పోస్ట్‌మ్యాన్‌ అభినయ వాసుదేవ్‌గా కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. సహజ చిత్రీకరణ కోసం చాలా చోట్ల డూప్ లేకుండా యాక్షన్‌ సీన్స్ తీశారు.

దర్శకులు ఇద్దరూ కూడా చాలా క్లారిటీగా, డెడికేషన్‌తో సినిమా చేశారని కిరణ్ తెలిపారు. ఎక్కడి నుంచో అనుకరించడం వంటివి లేకుండా కొత్తగా ట్రై చేశారని, నిజానికి ఈ సినిమాను పాన్‌ ఇండియా రిలీజ్‌కి ప్లాన్‌ చేశామని అన్నారు.

తమిళ సినిమాలు రిలీజులు ఎక్కువ ఉండటంతో తమిళనాడు థియేటర్లు దొరకలేదు. మలయాళంలో దుల్కర్‌ ‘లక్కీభాస్కర్‌’ విడుదల అదే రోజు ఉందన్నారు. ఆయనే తమ సినిమా కూడా మలయాళంలో రిలీజ్‌ చేస్తున్నారని వివరించారు.

అందుకే.. ఒకే ప్రొడక్షన్‌ నుంచి రెండు సినిమాలు ఒకే రోజు విడుదల చేయడం కరెక్ట్‌ కాదని మలయాళంలో రిలీజ్‌ ఆపామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *