తమిళ రాజకీయాల్లో ‘విజయ్’ మార్క్ వ్యూహం: 234 స్థానాల్లో ఒంటరిగానే.. పనైయూర్ ఆఫీస్ వద్ద ఏం జరుగుతోంది?
చెన్నై: తమిళనాడు రాజకీయ రణక్షేత్రం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరికొత్త మలుపులు తిరుగుతోంది. ద్రవిడ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలకు సవాల్ విసురుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నటుడు విజయ్, తన పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను ఒంటరిగానే బరిలోకి దించుతున్నట్లు ప్రకటించడంతో తమిళ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా వేడి పెరిగింది. పొత్తుల కోసం ఎదురుచూడకుండా విజయ్ తీసుకున్న ఈ ‘సోలో’ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలేంటి?
తమళనాడులో జాతీయ స్థాయి పార్టీలు ఉన్నా, ఎప్పుడూ రెండు ప్రాంతీయ పార్టీల నడుమే ఎన్నికల పోటీ ఉండేది. ఇది సాధారణ స్థితిలో కాదు, రణక్షేత్రంలా నడిచేది. ఆ పార్టీలే అధికారంలోకి వచ్చేవి. వస్తున్నాయి కూడా. అయితే గత కొద్ది సంవత్సరాలుగా తమిళ నటులు రాజకీయాలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. విజయకాంత్, కమలహాసన్ వంటి నాయకులు పార్టీలు పెట్టారు. చల్లబడ్డారు. తాజాగా ఆ కోవలోకే వస్తారు హీరో విజయ్. ఆయన ఓ ప్రభంజనంలా వచ్చారు.
విజయ్ తన పార్టీ తొలి బహిరంగ సభలోనే ఒక కీలక ప్రకటన చేశారు. తమతో కలిసి వచ్చే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం (Power Sharing) ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.కాలం కలిసొస్తున్నదనుకున్న విజయ్ కు పార్టీు కలిసిరాలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న సమీకరణల ప్రకారం కాంగ్రెస్, VCK వంటి పార్టీలు డీఎంకే కూటమిని వీడలేదు. ఎన్నికలలో దేశవ్యాప్తంగా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న బీజేపీతో కలసి ప్రయాణం చేస్తే, తన సెక్యులర్ ఇమేజ్ దెబ్బతింటుందని విజయ్ భావించారు.
అందుకే అమిత్ షా వంటి అగ్రనేతల నుండి వచ్చిన రాయబారాలను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎవరూ కలిసి రాకపోవడంతో, తన బలాన్ని నిరూపించుకోవడానికి 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడమే సరైన మార్గమని విజయ్ నిర్ణయించుకున్నారు.
‘పనైయూర్’ ఆఫీస్ చుట్టూ మర్మమేంటి?
చెన్నైలోని పనైయూర్‌లో ఉన్న టీవీకే ప్రధాన కార్యాలయం ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారింది. అక్కడ నిర్మించిన కొత్త గోడలు, కట్టుదిట్టమైన భద్రత వెనుక ఏదో మర్మం ఉందనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల వ్యూహకర్తలతో విజయ్ ఇక్కడే రహస్య చర్చలు జరుపుతున్నారని, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత గోప్యంగా సాగుతోందని సమాచారం. పార్టీ కార్యకర్తలకు కూడా అనుమతి లేని ఈ ‘మర్మ గోడల’ వెనుక విజయ్ తన విజయ సూత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read this article also : Tamil Politics: ఈపీఎస్, ఉదయకుమార్ వల్లే అన్నాడీఎంకే నాశనం.. ఓపీఎస్ ఘాటు విమర్శలు!
చతుర్ముఖ పోటీ-ఎవరికి లాభం?
విజయ్ ఒంటరి పోరుతో తమిళనాడులో ఈసారి ‘చతుర్ముఖ పోటీ’ నెలకొనబోతోంది. డీఎంకే కూటమి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో బలంగా ఉంది. అన్నాడీఎంకే కూటమి బీజేపీతో కలిసి పాత వైభవం కోసం ప్రయత్నిస్తోంది.
తమిళ నటుడు, రచయిత సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ఎప్పటిలాగే ఒంటరిగా బరిలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ కంటే మెరుగైన స్థానంలో ఉంది.
టీవీకే (TVK) పార్టీకి ఉన్న ఒకే ఒక ఆసరా విజయ్ చరిష్మా. విజయ్ తన అభిమానుల ఓట్లతోపాటు కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా యువత, కొత్త ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపితే, అది ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించబోతోంది.
Read this article aslo: ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా: ఏప్రిల్ 9 నుండి పోలింగ్.. మే 4న ఫలితాలు!
English Summary :
The political landscape of Tamil Nadu is witnessing a high-stakes shift as actor-turned-politician Vijay and his party, Tamilaga Vettri Kazhagam (TVK), have decided to contest all 234 assembly seats independently in the 2026 elections. Despite Vijay’s initial offer of power-sharing to potential allies, major parties like the Congress and VCK have remained loyal to the DMK-led alliance, while Vijay reportedly declined overtures from the BJP to preserve his secular image. This strategic “solo” move transforms the traditional Dravidian duopoly into a complex four-pronged battle involving the DMK bloc, an AIADMK-BJP combine, Seeman’s Naam Tamilar Katchi (NTK), and the TVK.
The nerve center of Vijay’s political operation is his Panaiyur headquarters in Chennai, which has become a subject of intense speculation due to heightened security and “mysterious walls” that restrict even party workers. Analysts believe Vijay is using this seclusion to finalize candidate selections and fine-tune a secret “victory formula” with elite political strategists. As the election approaches, the million-dollar question remains whether Vijay’s immense stardom and appeal to first-time voters will create a genuine wave or simply act as a vote-splitter, ultimately determining the fate of the state’s established political giants.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.
