April 13, 2026

‘బిచ్చగాడు’ కాంబోలో ‘వంద దేవుళ్లు’..

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిచ్చగాడు’ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ‘వంద దేవుళ్లు’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. చెరుకు తోట నేపథ్యంలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, వెనుక స్వాసిక కూడా అదే తరహా గెటప్‌లో ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బిచ్చగాడు’ లాగే ఈ సినిమా కూడా ఒక భిన్నమైన కథాంశంతో, భావోద్వేగాల మేళవింపుతో సాగుతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

అమ్మవారి ఆశీస్సులతో ‘కామాఖ్య’ థ్రిల్లర్ ఈ వార్తను కూడా చదవండి

ఈ చిత్రంలో స్వాసిక కథానాయికగా నటిస్తుండగా, అజయ్, కావ్యా శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూనే, ఈ యాక్షన్ డ్రామాలో ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించబోతున్నారు.

దర్శకుడు శశి తన సినిమాల్లో బలమైన ఎమోషన్స్‌ను పండిస్తుంటారు. ‘బిచ్చగాడు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన ఈ ద్వయం, ‘వంద దేవుళ్లు’ తో కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

VijayAntony #VandaDevullu #BichagaduCombo #TeluguCinema #FirstLook #TollywoodNews #ActionDrama #MovieUpdates

అమ్మవారి ఆశీస్సులతో ‘కామాఖ్య’ థ్రిల్లర్ ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *