April 12, 2026

ఇరాన్ కొత్త నేతలే టార్గెట్: అమెరికా భారీ రివార్డు.. ఇప్పటికే ఇద్దరు హతం!

అమెరికా ప్రభుత్వం ఇరాన్‌లోని కీలక ఉన్నతాధికారుల కోసం భారీ నజరానా ప్రకటించింది. ట్రంప్ ప్రభుత్వం మార్చి 15, 2026న ఆరుగురు సీనియర్ ఇరాన్ నేతల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. అయితే, వీరిలో ఇద్దరు ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు సమాచారం. ఇరాన్ రాజకీయ, ఇంటెలిజెన్స్, భద్రతా వ్యవస్థల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా వీరు గుర్తింపు పొందారు.

అమెరికా ఎందుకు టార్గెట్ చేసింది?

ఖమైనీ మరణించినా.. ఆయన కుమారుడు సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ గాయపడి చికిత్స పొందుతున్నా ఇరాన్ అమెరికాను ధీటుగా ఎదుర్కొంటుంది. దీంతో ఇరాన్ యుద్ధంలో ఇన్నాళ్లు నిలదొక్కుకోవడం ఏంటని అమెరికాకు అంతు చిక్కడం లేదు. అందుకే ఆరుగురు నేతలు ఇరాన్ పాలనలో కీలక స్తంభాలుగా ఉన్నారు. మతపరమైన అధికారం, నిఘా సమన్వయం, సైనిక శక్తిలో వీరి పాత్ర అత్యంత కీలకం. అందుకే అమెరికా వీరిని ‘హై-వాల్యూ టార్గెట్స్’గా పరిగణిస్తోంది.

ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు మృతి

అమెరికా రివార్డు ప్రకటించిన జాబితాలో ఉన్న వారిలో ఇద్దరు నేతలు ఇప్పటికే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ, ఇరాన్ అధికార యంత్రాంగంపై పూర్తి అవగాహన కోసం వీరి పేర్లను కూడా నివేదికలో చేర్చారు. మిగిలిన నలుగురు నేతల కోసం నిఘా వర్గాలు వేట కొనసాగిస్తున్నాయి. వారి వివరాలు చెప్పిన వారికి అమెరికా భారీ నజరానా ప్రకటించింది.

#Iran #USA #Trump #Israel #InternationalNews #Intelligence #GlobalPolitics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *