9వ వరుస బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్ధిక మంత్రి నిరలా సీతారామన్ ఉదయం 11 గంటలకు, లోక్ సభలో తన తొమ్మిదవ వరుస కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీనితో ఆమె మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం రికార్డును సమం చేశారు వరుస బడ్జెట్ సమర్పణల పరంగా ప్రణబ్ ముఖర్జీని అధిగమించారు. అయితే, మొత్తం రికార్డు మోరార్జీ దేశాయ్ పేరిట ఉంది, ఆయన ఆర్థిక మంత్రి, ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో పది కేంద్ర బడ్జెట్లను సమర్పించారు. ఈ బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ అంచనా ఆదాయాలు వ్యయాలను వివరిస్తుంది, రాబోయే నెలలకు విధానపరమైన ఆర్థిక దిశను నిర్దేశిస్తుంది. వృద్ధి, ఆర్థిక స్థిరీకరణ, సంక్షేమ వ్యయం, మూలధన పెట్టుబడికి సంబంధించిన అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
#UnionBudget2026 #NirmalaSitharaman #IndianEconomy #BudgetRecords #Modi3_0 #EconomicGrowth #BreakingNewsTelugu

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
