March 27, 2026

శ్రీ రేణుకామాత ఆలయాన్ని సందర్శించిన టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు

టిటిడి ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులు, సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన శ్రీ రేణుకామాత ఆలయాన్ని టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం తిరుపతి సమీపంలోని రామచంద్రాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, గ్రామంలో ప్రతిరోజూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్‌ను ఆయన అభినందించారు.

దూర గ్రామాల్లోనూ ప్రజలు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ, నిత్య ఆధ్యాత్మిక–సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందకరమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ధార్మిక అవగాహనను పెంచడంతో పాటు సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వాహకులు భారత్, ఆదిత్య, సమరసత సేవా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు, జోనల్ కన్వీనర్ రెడ్డెప్పరావు పాల్గొన్నారు. వారు గ్రామస్తులతో మమేకమై ఆలయ ప్రాముఖ్యతను, సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
#TTD
#BRNaidu
#SriRenukaMathaTemple
#Tirupati
#HinduTemples
#SanatanaDharma
#TempleDevelopment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *