March 25, 2026

TRAI strict rules for Telecom: ఇకపై 30 రోజుల రీచార్జ్ ప్లాన్ తప్పనిసరి!

Telecom Update

మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం (Telecom) రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ (30 Days Validity) కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. సాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉన్నప్పటికీ, కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తుండటంపై పార్లమెంటులో చర్చ జరిగింది.

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) సానుకూలంగా స్పందించారు. టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీని ఇవ్వడం వల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని ఎంపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగిలిపోయిన డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ (Data Carry Forward) చేయాలని కూడా డిమాండ్ చేశారు.

Read this article also: ఎన్‌కౌంటర్‌కు ఎన్‌కౌంటర్‌తోనే సమాధానం చెబుతాం”: మీరట్‌లో AIMIM నేత షౌకత్ అలీ

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల ప్రకారం, ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా కనీసం ఒక 30 రోజుల ప్లాన్‌ను చేర్చాలని మంత్రి స్పష్టం చేశారు. కంపెనీలు ఈ నిబంధనను పాటిస్తున్నప్పటికీ, వాటిని వినియోగదారులకు తెలిసేలా మార్కెటింగ్ చేయాలని ఆదేశించారు. రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్ (Incoming Calls) నిలిపివేయడం సరికాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం అమలులో ఉన్న ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం వల్ల ధరల నిర్ణయంలో ఆపరేటర్లకు స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ట్రాయ్ ఈ అంశాలను పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది. వినియోగదారులకు ఊరటనిచ్చేలా త్వరలోనే మరిన్ని స్పష్టమైన ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

English Summary:

The central government is pushing telecom operators to prioritize 30-day validity recharge plans over the standard 28-day cycle. During a recent Rajya Sabha session, concerns were raised about how the current 28-day model forces users to recharge 13 times a year instead of 12, leading to extra costs for consumers.

Union Minister Jyotiraditya Scindia confirmed that TRAI regulations already mandate at least one 30-day plan per operator. The government is now reviewing additional issues, such as data carry-forward options and extending incoming call validity after a plan expires, to ensure better transparency and benefits for mobile users across the country.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *