April 12, 2026

తిరుమల దర్శనం: 18 గంటల నిరీక్షణ | Tirumala Updates

శిలాతోరణం వరకు క్యూలైన్లు.. పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం కంటే అధికంగా కొనసాగుతోంది. గురువారం (మార్చి 19, 2026) నాటి గణాంకాలను పరిశీలిస్తే, స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్నీ నిండిపోయి, క్యూలైన్ వెలుపల ఉన్న సిలాతోరణం వరకు విస్తరించింది.

శ్రీవారి దర్శన గణాంకాలు

గత 24 గంటల్లో స్వామివారిని దర్శించుకున్న భక్తులు మరియు హుండీ ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి:

  • మొత్తం భక్తుల సంఖ్య: 57,272 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
  • తలనీలాలు: మొక్కులు చెల్లించుకున్న భక్తుల సంఖ్య 23,842.
  • హుండీ ఆదాయం: భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం లభించింది.

నిరీక్షణ సమయం (Darshan Waiting Time)

శ్రీవారి సర్వదర్శనం (SSD టోకెన్లు లేని వారు) కోసం వేచి ఉన్న భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ (TTD) నిరంతరం తాగునీరు, అన్నప్రసాదం పంపిణీ చేస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *