March 23, 2026

చంద్రగ్రహణం ప్రభావం: రాత్రి 8.30 నుంచి శ్రీవారి సర్వదర్శనం

తిరుమలలో 75,174 మంది భక్తుల రాక

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే మొత్తం 75,174 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

ఇందులో 17,734 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.29 కోట్లు నమోదైంది.

ఇక ఈ రోజు మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఆలయ కార్యక్రమాల్లో తాత్కాలిక మార్పులు చేశారు. గ్రహణం సమయాల్లో ఆలయ ద్వారాలు మూసివేసి, శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8.30 గంటలకు శ్రీవారి సర్వదర్శనం తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.

దర్శనానికి వచ్చే భక్తులు సమయ మార్పులను గమనించి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

ఓం నమో వెంకటేశాయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *