
తిరుపతి, జూన్ 3: తిరుమల దర్శనం కోసం శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గంలో కాలినడకన వస్తున్న భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు (Divya Darshan Tokens) జారీ ప్రక్రియలో తాత్కాలిక మార్పులు (temporary change) చేసింది టిటిడి (TTD). ప్రస్తుతం మెట్టు వద్ద ఉన్న టోకెన్ కౌంటర్లను అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ (Alipiri Bhudevi Complex) కు మార్చాలని నిర్ణయించింది. ఈ నూతన కౌంటర్లు ఈ నెల 6వ తేదీ శుక్రవారం సాయంత్రం నుండి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.
ఈ విషయంపై టిటిడి ఈవో జె. శ్యామలరావు మంగళవారం సాయంత్రం అధికారులతో వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ సదుపాయాలు, అన్నప్రసాదం సేవలు మరియు పారిశుద్ధ్యం అంశాలపై వివరణాత్మకంగా చర్చించారు.
ముఖ్యాంశాలు:
-
భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి స్పష్టం చేసింది.
-
టోకెన్లు ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ (first come first serve) ఆధారంగా ఆధార్ కార్డు చూపించి ఇవ్వబడతాయి.
-
టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టు 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయాల్సి ఉంటుంది.
-
శనివారం దర్శనం కోసం శుక్రవారం సాయంత్రం టోకెన్లు మంజూరు చేయనున్నారు.
-
SSD టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ప్రత్యేక కౌంటర్లలో లభ్యమవుతాయి.
-
భక్తుల రద్దీ, భద్రతా చర్యలు, లైనింగ్ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించారు.
-
మార్పులకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని టిటిడి ఆదేశించింది.
-
ఇంజనీరింగ్ అధికారులు భక్తుల కోసం పటిష్ట క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
-
అన్నప్రసాదాల వసతి, పారిశుద్ధ్యంపై విభాగాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.