
- వేడుకల్లో గంజాయి కలకలం
- పలువురికి Drug Test పాజిటివ్
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు (Birthday celebrations) డ్రగ్స్ వ్యవహారంతో వివాదంలోకి తగిలాయి. మంగళవారం రాత్రి చేవెళ్ల (Chevella) సమీపంలోని త్రిపుర రిసార్ట్‌లో జరిగిన ఈ పార్టీపై పోలీసులు ఆకస్మికంగా దాడులు (police raid) నిర్వహించారు. ఈ దాడిలో గంజాయి (Marijuana), విదేశీ మద్యం స్వాధీనం చేసుకోగా, పార్టీలో పాల్గొన్న కొందరికి డ్రగ్స్ పాజిటివ్ (Drug Test Positive) వచ్చిందని సమాచారం.
ఈ వేడుకల్లో మంగ్లీ స్నేహితులు, పరిశ్రమకు చెందిన పలువురు పాల్గొన్నారు. పక్కా సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు త్రిపుర రిసార్ట్‌ను తనిఖీ చేసి విదేశీ మద్యం (foreign liquor) ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డ్రగ్స్ టెస్టులు (medical tests) నిర్వహించగా, కొందరికి గంజాయి వాడకం స్పష్టమైందని, కేసులు నమోదు చేసినట్లు చేవెళ్ల పోలీసులు తెలిపారు.
మంగ్లీ (Mangli) తన గాత్రంతో తెలంగాణా ఫోక్ పాటలకు (Telangana Folk Songs) ప్రత్యేక గుర్తింపు తెచ్చిన గాయని. బతుకమ్మ, బోనాలు, శివరాత్రి వంటి ఉత్సవాలకు సంబంధించి అనేక పాపులర్ పాటలను ఆలపించింది. న్యూస్ యాంకరింగ్‌తో కెరీర్ ప్రారంభించిన మంగ్లీ, ప్రైవేట్ ఆల్బమ్‌లతో (private albums) పాపులర్ అయ్యి, సినిమాల్లో ఎన్నో హిట్ పాటలు పాడింది. ప్రస్తుతం సినిమాలు, వేడుకల్లో పాడుతూ బిజీగా ఉంటున్న మంగ్లీకి సంబంధించిన ఈ వివాదం టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు, విచారణ కొనసాగుతోంది. డ్రగ్ వినియోగంపై ఇప్పటికే సినీ పరిశ్రమ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంగ్లీ పార్టీ ఘటన మరోసారి చర్చకు దారి తీసింది.