శర్వానంద్ ‘బైకర్’ ట్రైలర్ లాంచ్
BIKER
దేశం మొత్తం మాట్లాడుకునే సినిమా అవుతుంది!
యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబినేషన్‌లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వెంచరస్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం మేకర్స్ గ్రాండ్‌గా విడుదల చేశారు.
బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం: శర్వానంద్
ట్రైలర్ లాంచ్ వేదికగా హీరో శర్వానంద్ ధీమా వ్యక్తం చేస్తూ.. “గతంలో ‘నారీ నారీ నడుమ మురారి’తో హిట్ కొడతానని చెప్పాను, అలాగే జరిగింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను.. ‘బైకర్’తో బంపర్ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. ఇండియా మొత్తం మాట్లాడుకునే రేంజ్‌లో ఈ సినిమాను అద్భుతంగా తీశాం. సీనియర్ నటుడు రాజశేఖర్ గారితో కలిసి నటించడం ఒక గొప్ప అనుభవం. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లు దగ్గరుండి కథలు, పాటలు రాయించుకుని సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు” అని అన్నారు.
హీరోలాగే సెట్స్‌కు వెళ్ళాను: రాజశేఖర్
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాజశేఖర్ మాట్లాడుతూ.. “ఇందులో నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. యూవీ క్రియేషన్స్ ట్రీట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. షూటింగ్‌కు నేను ఒక హీరోలాగే వెళ్ళాను, సినిమా చాలా బాగా వచ్చింది” అని తన సంతోషాన్ని పంచుకున్నారు.
టెక్నికల్ వండర్‌గా ‘బైకర్’
దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ, ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సౌండ్ డిజైన్ గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారని, ఇది ఒక కొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని తెలిపారు. బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వచ్చి చాలా కాలమైందని, కచ్చితంగా ఇది బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని అన్నారు.
ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్
ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభూతిని పంచేందుకు Dolby Cinema, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
Sharwanand #BikerMovie #UVCreations #Motocross #TeluguCinema #TrailerLaunch #Rajashekar #April3Release #TollywoodUpdates

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
