March 26, 2026

శాంతారామ్ కు టీటీడీ బోర్డు మెంబర్

 

కష్టానికి తగిన గుర్తింపు.. వైద్యం శాంతారామ్

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో పార్టీ నేత వైద్యం శాంతారామ్ తితిదే పదవి వరించింది. కుప్పం మండలం వసనాడు గొల్లపల్లెకు చెందిన శాంతారామ్ తితిదే పాలకమండలి సభ్యుడిగా నియమితులయ్యారు.

నాయీబ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఈయనకు ఈ పదవి రావడంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుండనంలో సందేహం లేదు.

పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన శాంతారామ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలకమండలి బోర్డు సభ్యుడిగా అవకాశం దక్కింది.

గతంలోనూ బీసీ వర్గానికి చెందిన శాంతిపురం మండల సీనియర్ నేత గౌనివారి శ్రీనివాసులుకు తితిదే పాలకవర్గ సభ్యుడి పదవిని చంద్రబాబు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *