‘గేదెల రాజు’ హిట్ ఖాయం: సోలో హీరోగా రఘు కుంచె మెరుపులు.. రేపే థియేటర్లలోకి!
GEDELA RAJU
హైదరాబాద్: మ్యూజిక్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘు కుంచె, ఇప్పుడు ‘గేదెల రాజు’ (కాకినాడ తాలుకా) చిత్రంతో సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మోటూరి టాకీస్ పతాకంపై చైతన్య మోటూరి దర్శకత్వంలో వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 24న (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
నవ్వుల జెట్ స్పీడ్ ‘జెట్లీ’: సత్య హీరోగా రితేష్ రానా మ్యాజిక్.. ట్రైలర్ అదిరిపోయింది! ఈ వార్తను కూడా చదవండి
ముఖ్య అతిథిగా వి.వి. వినాయక్: ఈ వేడుకకు స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. “రఘు కుంచె ఇండస్ట్రీలో అందరికీ ఆత్మీయుడు. సోలో హీరోగా నటించాలన్న ఆయన కల ఈ చిత్రంతో నెరవేరడం సంతోషంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయడం మొదటి విజయంగా భావిస్తున్నాను. చైతన్య ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్‌తో తెరకెక్కించాడు” అని ప్రశంసించారు.
మైత్రీ మూవీ మేకర్స్ మద్దతు: రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ, సినిమా కంటెంట్ చాలా బాగుందని, రఘు కుంచె తనయుడు హీరోగా రాకముందే ఆయన హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషమన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, పరీక్షలు ముగిసి హాలిడేస్ ప్రారంభమైన తరుణంలో సినిమా విడుదల కావడం ప్లస్ అవుతుందని పేర్కొన్నారు. కాకినాడ నేపథ్యంలో సాగే ఈ మాస్ అండ్ ఎమోషనల్ డ్రామా రేపు (ఏప్రిల్ 24) థియేటర్లలో సందడి చేయనుంది.
News Article (English)
Hyderabad: Versatile technician Raghu Kunche, known for his work as a music director and singer, is set to make his debut as a solo hero with the film ‘Gedela Raju’ (Kakinada Taluka). Directed by Chaitanya Moturi and produced by Vani Ravikumar Moturi under the Moturi Talkies banner, the film is slated for a grand theatrical release on April 24th. The makers organized a gala pre-release event ahead of its debut.
VV Vinayak Graces the Event: Sensational director VV Vinayak, who attended as the chief guest, lauded Raghu Kunche’s journey in the industry. “Raghu has made many friends in Tollywood. His long-standing dream of becoming a solo hero is being fulfilled with this project. Having a major distribution house like Mythri Movie Makers release the film is a huge boost,” Vinayak said. He also wished director Chaitanya great success in his debut venture.
Positive Buzz for April 24 Release: Writer and producer Kona Venkat shared that the content of the film is promising and praised the timing of the release. Director VN Aditya noted that the movie is arriving just as summer vacations begin, which will help attract families and youth. With the support of top distributors and positive feedback for the trailer, Raghu Kunche Gedela Raju Movie Release 2026 is carrying a strong buzz. The film, set against the backdrop of Kakinada, is expected to be a career-defining moment for Raghu Kunche as an actor.
#RaghuKuncheGedelaRajuMovieRelease2026 #GedelaRaju #RaghuKunche #VVVinayak #KakinadaTaluka #TeluguCinema #NewRelease #MythriMovieMakers #TollywoodNews #ChaitanyaMoturi #GedelaRajuPreRelease
నవ్వుల జెట్ స్పీడ్ ‘జెట్లీ’: సత్య హీరోగా రితేష్ రానా మ్యాజిక్.. ట్రైలర్ అదిరిపోయింది! ఈ వార్తను కూడా చదవండి

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
