April 12, 2026

పశ్చిమాసియా యుద్ధం: పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)పై పెను ప్రభావం!

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు హార్మూజ్ జలసంధి మూసివేత ప్రభావం పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)పై స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన ఇంధన కొరత కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించి, వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన పీఎస్‌ఎల్ షెడ్యూల్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

రెండు వేదికలకే పరిమితం

తొలుత ఆరు నగరాల్లో నిర్వహించాలనుకున్న పీఎస్‌ఎల్ మ్యాచ్‌లను, ఇప్పుడు కేవలం కరాచీ మరియు లాహోర్‌ స్టేడియాలకే పరిమితం చేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మొహిసిన్ నఖ్వీ ఆదివారం ప్రకటించారు. లాజిస్టికల్ ఇబ్బందులు మరియు ఇంధన పొరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆరంభ వేడుకలు రద్దు.. అభిమానులకు నిరాశ

మార్చి 26న లాహోర్‌లో జరగాల్సిన గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీని పీసీబీ రద్దు చేసింది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ప్రజలు ప్రయాణాలు తగ్గించాలని ప్రభుత్వం కోరుతున్నందున, అభిమానులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. దీనివల్ల ఫ్రాంచైజీలకు కలిగే టికెట్ ఆదాయం నష్టాన్ని పీసీబీ పరిహారంగా చెల్లిస్తుందని నఖ్వీ హామీ ఇచ్చారు. ఒకవేళ 10-15 రోజుల్లో పరిస్థితులు చక్కబడితే షెడ్యూల్ పునఃసమీక్షిస్తామని తెలిపారు.

ఐపీఎల్ కోసం వెళ్తే కఠిన చర్యలు!

మరోవైపు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడేందుకు పీఎస్‌ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్న విదేశీ ఆటగాళ్లపై మొహిసిన్ నఖ్వీ నిప్పులు చెరిగారు.

  • పీఎస్‌ఎల్ వదిలి ఐపీఎల్‌కు వెళ్లే ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలతో పాటు నిషేధం విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
  • ఇప్పటికే బ్లెస్సింగ్ ముజరబాని (KKR), దసున్ శనక (RR) వంటి వారు ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ నుంచి తప్పుకోగా, మరికొందరు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు.
  • గతంలో కార్బిన్ బాష్‌పై విధించిన ఏడాది నిషేధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

పోటీపోటీగా లీగ్‌లు:

పీఎస్‌ఎల్ మార్చి 26న ప్రారంభం కానుండగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి షురూ కానుంది. రెండు లీగ్‌లు ఒకే సమయంలో తలపడుతుండటం, దానికి తోడు పాకిస్థాన్‌లోని అంతర్గత సమస్యలు పీఎస్‌ఎల్ మనుగడకు సవాలుగా మారాయి.

PSL2026 #CricketNews #PakistanCricket #IPL2026 #FuelCrisis #WestAsiaWar #PCB #SportsUpdates #CricketAlert

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *