
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న విస్తృత దాడులతో పోలాండ్ అప్రమత్తమయ్యింది. రష్యా విమానాలు చేసే భీకర శబ్ధాలు నాటూ కూటమిలోని పోలాండ్ గగనతలంలో ఆందోళనలు కలిగిస్తున్నాయి.
ఉక్రెయిన్పై రెండో రాత్రి కూడా రష్యా లాంగ్ రేంజ్ క్షిపణుల దాడులు జరపడంతో, పొలండ్ మరోసారి తన సంపూర్ణ వైమానిక రక్షణ వ్యవస్థను కార్యాచరణలోకి తెచ్చింది. ఈ పరిణామం దేశం యొక్క నైఋతి సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ స్థాయిని పెంచింది.
మే 26న, పొలండ్ సాయుధ దళాల ఆపరేషనల్ కమాండ్ ధృవీకరించిన వివరాల ప్రకారం, రష్యన్ బాంబర్ల దాడులకు స్పందనగా పోలోండ్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమమైన X వేదికగా విడుదల చేసిన ప్రకటనలో, నాటో మరియు పొలండ్ విమానాల నుంచి వచ్చే శబ్దాలకు ప్రజలు భయపడవద్దని సూచించడమే కాకుండా, దేశం మొత్తం వైమానిక రక్షణ ప్రక్రియలు అమల్లో ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది.
రష్యా ఫెడరేషన్ నుంచి లాంగ్ రేంజ్ వైమానిక దాడుల నేపథ్యంలో, ఇది పొలండ్కు వరుసగా రెండో రాత్రి విస్తృత స్థాయిలో వైమానిక రక్షణ వ్యవస్థ కార్యాచరణలోకి తీసుకు వచ్చిందని ఆ ప్రకటన స్పష్టం చేసింది.
సరిహద్దులపై కన్ను… రెడీగా ఉన్న రెస్పాన్స్ యూనిట్లు
రష్యా వైమానిక దాడులు నాటో సరిహద్దులకు దగ్గరగా జరిగి ఉండటంతో, పోలాండ్ మరింత అప్రమత్తమయ్యింది. అయితే ఇప్పటివరకు ఏ క్షిపణీ పొలండ్ గగనతలంలోకి ప్రవేశించలేదని అధికారికంగా వెల్లడించారు.
ప్రస్తుతానికి తాము పూర్తిస్థాయిలో రెడీగా ఉన్నామని, అవసరమైతే వెంటనే స్పందించగల సామర్థ్యం ఉందని ఆపరేషనల్ కమాండ్ స్పష్టం చేసింది.
ఈ సంఘటనకు ముందు వారాంతంలో ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన నిరంతర వైమానిక దాడులు యుద్ధ తీవ్రతను మరింతగా పెంచాయి.
ఉక్రెయిన్పై చెలరేగిన విరామరహిత దాడులు
మే 24 రాత్రి, కీవ్ నగరం శరవణ బాణాల మాదిరిగా క్షిపణులు, డ్రోన్ల వర్షానికి గురైంది. ఇది యుద్ధం మొదలయినప్పటి నుంచి అత్యంత తీవ్రమైన దాడిగా చెప్పవచ్చు.
మే 25 తెల్లవారుఝామున, రష్యాలోనే సంచలనాత్మకంగా 367 క్షిపణులు మరియు డ్రోన్లను ఉక్రెయిన్ ప్రాంతాలపై ప్రయోగించింది. ఈ దాడులలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 60 మందికి పైగా గాయపడినట్టు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు.