August 21, 2026

బాలయ్య బాబుకి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు

శతాధిక చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సాధించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

అలాంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య బాబుకు ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పవన్, “శతాధిక సినిమాల్లో కథానాయకుడిగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణగారు ప్రజా జీవితంలో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.

ఇప్పటికే కళ్యాణ్ రామ్, నారా రోహిత్, బాలకృష్ణ కూతురు తేజస్విని, దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని తదితరులు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్‌తో సోషల్ మీడియా వీధులన్నీ బాలయ్య పేరిట మార్మోగిపోతున్నాయి.

ఇక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన “Akhanda 2 Title Teaser” కూడా ప్రేక్షకుల్లో భారీగా హైప్ పెంచింది. బాలయ్య ఫ్యాన్స్ ఆ టీజర్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓ వైపు సెలబ్రిటీల విషెస్, మరోవైపు అఖండ సీక్వెల్ టీజర్ సందడి.. బాలయ్య బర్త్ డే వేడుకలు పండుగలా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీకు ఆసక్తి కలిగించే వార్తలు