
వదంతులు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో..నిజం అంతే నిదానంగా నిలకడమీద తెలుస్తుంది. ఇది చాలు పాకిస్తాన్ సైన్యానికి ఆ మధ్య సమయంలోనే తమపై ఉన్న అపనమ్మకాన్ని, అసంతృప్తిని దారి మళ్ళించడానికి. సరిగ్గా ఆ సైనికాధికారి మునీర్ అదే చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ సైన్య విజయగాథలు అంటూ కథలు వండి వార్చేస్తున్నారు. పాకిస్తాన్‌లాంటి దేశాల్లో జనాన్ని వెర్రిబాగులోళ్ళను చేయడం షరా మామూలే. అక్కడ అదే జరుగుతోంద.
ప్రజాస్వామ్యం కన్నా యూనిఫాంకు ఎక్కువ విలువ ఉండే దేశం పాకిస్తాన్‌లో, సైన్యం ఎప్పుడూ ఏదోక మాయాజాలం చేస్తుంటుంది. జాతీయ సంక్షోభం వచ్చిన ప్రతీ సారి అక్కడ ఇదే తంతు. అది వాస్తవమైనా కావొచ్చు, ఊహా కావొచ్చు. పాకిస్తాన్ సైన్యం పరాజితంగా కాకుండా, ధీరోదాత్తుడుగా కనిపించేలా తోలు బొమ్మల్లాటను తీర్చిదిద్దుకుంటోంది. ఆసిమ్ మునీర్ పీల్డ్ మార్షల్ ప్రధాన పాత్రలో ప్రొజెక్ట్ చేస్తున్నారు.
ఇండియాతో ప్రస్తుత ఉద్రిక్తతల సమయంలో మునీర్ హోదా అకస్మాత్తుగా పెరగిందిజ ఇది వ్యూహాత్మక అవసరం కంటే, ప్రజల్లో ధైర్యం నింపే కొత్త మిథ్యా కథనంగా పబ్లిక్ రిలేషన్ డ్రామా మొదలెట్టేసింది. మిలటరీపై విమర్శలొస్తున్నప్పుడు, ధైర్యంగా ఎదుర్కొన్నాం, సాంకేతికంగా ఇండియాను మించిపోయినాం అనే స్క్రిప్ట్ మళ్లీ రాస్తారు ఇది మామూలే. ఈసారి కథ డ్రోన్లతో, క్షిపణుల సామర్థ్యంతో, సైబర్ యుద్ధంతో ఇండియాను ఓడించామని కథలను సామాజిక మాధ్యమాలలో వెల్లివిరుస్తున్నాయి. ఈ మాయామాటలను స్వయంగా ప్రభుత్వ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియా ట్రోల్స్‌తో వాస్తవాలను వక్రీకరిస్తారు. కొన్ని రోజులకే ఇవన్నీ దేశ విజయగాధలుగా ప్రజలలో వ్యాప్తి చేస్తారు.
ఈ మిథ్యా విజయగాథలు ప్రజాస్వామ్య దేశాల్లో ఏమోగానీ,నియంతృత్వ శైలిలో నడుస్తున్న పాకిస్తాన్‌లో తప్పకుండా ఫలిస్తాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్తవ్యస్తత, సామాజిక అసంతృప్తి పెరిగిపోతున్న తరుణంలో, సైనిక విజయాల మాయాగాథలు సామాన్యుల తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. నిరక్షరాస్య యువత, నిరుద్యోగులు మళ్లీ ఖాకీ దుస్తుల్లో కనిపించే అధికారుల వైపు మొగ్గు చూపుతున్నారు. రూపాయి విలువ పడిపోతున్నా, కరెంట్ కట్‌లు పెరిగినా, ద్రవ్యోల్బణం శ్రమ పెడుతున్నా సైన్యానికి కావాల్సింది జనాన్ని తమ మిథ్యా విజయగాథలతో జనాన్ని బురడీ కొట్టించడం. ఆందోళనలను, అసంతృప్తిని పక్కన పెట్టి జనం మిథ్యా విజయాలకు చప్పట్లు కొడుతున్నారు. అది పాకిస్తాన్ సైన్య మాయాజాలం.