- వరదలకు ఏడుగురు మృతి
వర్షాకాలం అంటే చల్లదనం, తేమతో కూడిన ప్రకృతి మధురతే గుర్తుకొస్తుంది. కానీ ఈసారి వానకాలం క్రూరరూపం దాల్చింది. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో వర్ష భీభత్సం పెనుముప్పుగా మారింది. వరదలు, భూమి కోతలు, మంచు వర్షాలు ప్రజల జీవనాన్ని స్థంభింపజేశాయి. ప్రకృతి ప్రకోపానికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. నదులు, వంకలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాలు – అరుణాచల ప్రదేశ్, గౌహతీ దెబ్బతిన్నాయ్
అరుణాచల ప్రదేశ్‌లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా తీవ్ర భూమి కోతలు సంభవించాయి. ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. ఎక్కడికక్కడ రహదారులు మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని చోట్ల సహాయక బృందాలు శవాలు వెలికితీస్తూ ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించేందుకు శ్రమిస్తున్నాయి.
అస్సాంలో రాజధాని గౌహతీలో రోజుల తరబడి వర్షాలు కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. ఇంట్లలోకి నీరు చొరబడడంతో స్కూళ్లు, కళాశాలలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లలోనే నిర్బంధితులయ్యారు. భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఉత్తర రాష్ట్రాల్లో మంచు వర్షాలు, ప్రాణనష్టం
సిక్కింలో మంగన్ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ముసురు వర్షాలు, శీతల వాతావరణం ప్రబలించాయి. ధర్మశాలలో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ వద్ద కొండ చరియలు విరిగి పడడంతో ఓ యాత్రికుడు, డ్రైవర్ మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వర్షాల వల్ల పొలాలు తడిసి ముద్దవుతుండగా… ప్రజల జీవితాలు మాత్రం గందరగోళంగా మారిపోయాయి.
It’s sad to learn that 15 persons were killed in a fury of flash floods in North India, especially in Himachal Pradesh. Even parked cars were swept away in the flash floods of the Beas River in Kullu. Let’s respect nature. Illegal occupation near rivers or waterways is always a… pic.twitter.com/XDLv6se7jO
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 9, 2023