May 7, 2026

‘విష్ణు విన్యాసం’ హీరోయిన్ నయన్ సారిక ఆసక్తికర వ్యాఖ్యలు!

శ్రీ విష్ణు హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్‌ మారుతీ రావు దర్శకత్వంలో సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ నయన్ సారిక తన మనసులోని మాటను బయటపెట్టారు. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో ఒక్క ఛాన్స్ వచ్చినా అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆమె పేర్కొన్నారు.

వైవిధ్యమైన మనీషా పాత్రలో..

ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. “ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనీషా అనే కాలేజీ ఫ్యాకల్టీ పాత్రలో కనిపిస్తాను. టీజర్‌లో నా క్యారెక్టర్ కాస్త బోల్డ్ అండ్ ఫీమేల్ డామినేటింగ్ షేడ్స్‌లో కనిపించినా, దానికి వెనుక ఉన్న బలమైన కారణం సెకండాఫ్‌లో రివీల్ అవుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసి, ఆ తర్వాత హ్యాపీగా బతకాలని కోరుకునే అమ్మాయి కథ ఇది” అని నయన్ సారిక వివరించారు.

శ్రీ విష్ణుతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్

శ్రీ విష్ణుతో కలిసి పనిచేయడం ఒక సరదా జర్నీ అని హీరోయిన్ తెలిపారు. ఇద్దరు లెక్చరర్ల మధ్య సాగే ఈ ప్రేమకథ నేటి యువతకు, విద్యార్థులకు బాగా కనెక్ట్ అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను నటించిన ‘గంగం గణేశా’, ‘ఆయ్’, ‘క’ వంటి చిత్రాల వరుస విజయాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయని, ‘విష్ణు విన్యాసం’ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

డ్రీమ్ ప్రాజెక్ట్ అదే.. చేతిలో మరిన్ని సినిమాలు

తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘రాకాస’ అనే ఫాంటసీ కామెడీ చిత్రంతో పాటు గోల్డెన్ స్టార్ గణేష్‌తో ఒక కన్నడ సినిమా చేస్తున్నట్లు నయన్ సారిక తెలిపారు. తన కెరీర్‌లో ఏదో ఒక రోజు రాజమౌళి దర్శకత్వంలో నటించాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు రధన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తాయని ఆమె పేర్కొన్నారు.

#NayanSarika #VishnuVinyasam #SreeVishnu #Rajamouli #TeluguCinema #TollywoodUpdates #MovieInterview #NewRelease

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *