April 18, 2026

తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ: లోకేష్

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తేజిత ప్రసంగం చేశారు. 1982 మార్చి 29న నందమూరి తారకరామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఈ పార్టీని స్థాపించి, దేశ రాజకీయ చరిత్రనే మార్చేశారని కొనియాడారు. టీడీపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అది తెలుగువారి గుండె చప్పుడు అని లోకేష్ పేర్కొన్నారు.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన ఘనత అన్న ఎన్టీఆర్‌దేనని లోకేష్ స్పష్టం చేశారు. రూ.2లకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తి హక్కు వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఆయన హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. అదేవిధంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని పరిచయం చేసింది ‘బ్రాండ్ సీబీఎన్’ అని కొనియాడారు. హైటెక్ సిటీ నుంచి అమరావతి వరకు, ఐటీ నుంచి క్వాంటం టెక్నాలజీ వరకు చంద్రబాబు విజన్ సాటిలేనిదని, 75 ఏళ్ల వయసులో కూడా ఆయన 25 ఏళ్ల యువకుడి వేగంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు.

చంద్రగిరి నీటి కష్టాలకు చెక్! ఈ వార్తను కూడా చదవండి

టీడీపీని అంతం చేస్తామన్న వారే అడ్రస్ లేకుండా పోయారని, కార్యకర్తల త్యాగాలే పార్టీని ఇన్ని ఏళ్లుగా కాపాడుతున్నాయని లోకేష్ అన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన అంజిరెడ్డి, తోట చంద్రయ్య వంటి కార్యకర్తలే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిస్తూ, వారిని నేడు అధినేత పక్కన కూర్చోబెట్టామని తెలిపారు. పార్టీ కేడర్ సంక్షేమం కోసం రూ.5 లక్షల ప్రమాద బీమాతో పాటు, కమిటీల్లో ఉన్న వారందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ చేయించి, ఫాలోఅప్ కేర్ కూడా అందిస్తామని కీలక హామీ ఇచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ (CCD) అనే వింత జబ్బుతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆయన జబ్బుకు నిదర్శనమని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనలో 79 మంది టీడీపీ కార్యకర్తలను చంపినా, అక్రమ కేసులు పెట్టి వేధించినా భయపడలేదని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రైక్ రేట్‌తో తమకు అఖండ విజయాన్ని అందించారని లోకేష్ గుర్తు చేశారు.

#TDP44Years #NaraLokesh #JaiTDP #ChandrababuNaidu #JoharNTR #TDPFoundationDay #AndhraPradesh #PanchayatiRajMinister

చంద్రగిరి నీటి కష్టాలకు చెక్! ఈ వార్తను కూడా చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *