September 21, 2026

మంగ్లీ : “అనుమతులు తీసుకోవాలనే విషయం తెలియదు”

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) వివాదాస్పదంగా మారాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో జరిగిన పార్టీలో మద్యం, గంజాయి (Ganja) పట్టుబడినట్లు వార్తలు రాగా, అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతో సహా మరికొందరిపై పోలీసులు కేసు (Case) నమోదు చేశారు. తనకు మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతులు తీసుకోవాలనే విషయం తెలియదని మంగ్లీ స్పష్టం చేసింది.

హైదరాబాద్, జూన్ 12: సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు (Birthday Celebrations) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‏లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేసి మద్యం, గంజాయి (Ganja) స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారనే ఆరోపణలపై మంగ్లీతోపాటు మరికొందరిపై కేసు (Case) నమోదు చేశారు పోలీసులు.

సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకులు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్‏లో అర్ధరాత్రి జరిగిన బర్త్ డే సెలబ్రేషన్స్‏పై పోలీసులు ఆకస్మిక దాడి చేసి భారీగా విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారని… మంగ్లీతోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారని వార్తలు వినిపించాయి. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించారన్న ఆరోపణలపై మంగ్లీ స్పందించారు. తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని.. లిక్కర్ వాడకంపై ముందస్తు అనుమతి తీసుకోవాలన్న విషయం తనకు తెలియదని చెబుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.

“నా బర్త్ డే పార్టీ మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబసభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ పార్టీలో మా ఫ్యామిలీతోపాటు బంధువులు, స్నేహితులు ఉన్నారు. లిక్కర్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. లిక్కర్ కు, సౌండ్ సిస్టమ్ కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అస్సలు అవగహన లేదు. రిసార్ట్ పార్టీ అనుకోకుండా.. సడెన్ ప్లాన్ చేసుకున్నాము. నాకు ఎవరు చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు. అక్కడ పార్టీలో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి మత్తు పదార్థాలు లేవు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్త పదార్థాలు దొరకలేదు. ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి ఎక్కడో.. ఎప్పుడో తీసుకున్నాడని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతుంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్ ” అంటూ మంగ్లీ వీడియోలో చెప్పుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మీకు ఆసక్తి కలిగించే వార్తలు