March 18, 2026

బెంగాల్ పాలిటిక్స్‌లో ‘బిగ్ ఫైట్’: మమతను ఆమె గడ్డపైనే సవాల్ చేస్తున్న సువేందు..

Mamatha-Suvendho

ఏళ్ల అనుబంధం నుండి 2026 యుద్ధం వరకు.. విశ్లేషణ!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఎప్పుడూ భావోద్వేగాలు, వ్యక్తిగత వైరం, సిద్ధాంతపరమైన పోరాటాల కలయికగా ఉంటాయి. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికల దిశగా చూస్తే, ఈసారి సమీకరణాలు మరింత వ్యక్తిగతంగా మారాయి. ఒకప్పుడు ఒకే వేదికపై నిలబడి పోరాడిన నాయకులు, ఇప్పుడు ఒకరిని ఒకరు కూలదోయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో Mamata Banerjee, Suvendu Adhikari మధ్య జరుగుతున్న రాజకీయ పోరు రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది.

Read this article also: తమిళ రాజకీయాల్లో ‘విజయ్’ మార్క్ వ్యూహం: 234 స్థానాల్లో ఒంటరిగానే.. పనైయూర్ ఆఫీస్ వద్ద ఏం జరుగుతోంది?

గురుశిష్యుల బంధం: ఎదుగుదలకు పునాది

దాదాపు రెండు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ బంధం, బెంగాల్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయం. మమతా బెనర్జీ 1998లో All India Trinamool Congress స్థాపించిన తర్వాత, కాంగ్రెస్ నుంచి వచ్చిన సువేందు అధికారి ఆమెకు అతి నమ్మకస్తుడిగా మారారు. కేవలం రాజకీయ సహచరుడు మాత్రమే కాదు, ఉద్యమాల మైదానంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు.

2007లో జరిగిన Nandigram movement బెంగాల్ రాజకీయాలను పూర్తిగా మలుపు తిప్పిన ఉద్యమం. ఈ ఉద్యమం వెనుక వ్యూహాత్మకంగా, ప్రాక్టికల్‌గా పని చేసిన నాయకుల్లో సువేందు ముందంజలో ఉన్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటం మమతను ప్రజా నాయకురాలిగా స్థాపించగా, సువేందును గ్రాస్‌రూట్ లీడర్‌గా నిలబెట్టింది.

టీఎంసీ ప్రభుత్వంలో ఆయనకు రవాణా, నీటిపారుదల వంటి కీలక శాఖలు దక్కడం, పార్టీలో ఆయన స్థాయిని సూచిస్తుంది. మమత తర్వాత ‘నెంబర్ 2’గా ఎదిగిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

బంధం చీలిక: రాజకీయమా? వ్యక్తిగతమా?

అయితే 2020 తర్వాత పరిస్థితి మారిపోయింది. మమతా బెనర్జీ మేనల్లుడు Abhishek Banerjee పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఎదగడం, సువేందు ప్రాధాన్యత తగ్గడానికి కారణమైంది. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు, వ్యక్తిగత అవమానంగా కూడా ఆయన భావించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ పరిణామాల మధ్య, సువేందు 2020 డిసెంబర్‌లో టీఎంసీని వీడి Bharatiya Janata Partyలో చేరడం, బెంగాల్ రాజకీయాల్లో పెద్ద షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన మమతపై అత్యంత కఠిన విమర్శకుడిగా మారారు.

నందిగ్రామ్ 2021: గురువును శిష్యుడు ఓడించిన రోజు

2021 ఎన్నికలు ఈ గురుశిష్యుల సంబంధాన్ని వ్యక్తగత కక్షగా మార్చిన పరిణామం. తనను తన పార్టీని కాదని వెళ్ళిన సువెందో అధికారిని ఓడించి అతనికి అంత సీన్ లేదని నిరూపించి నోరు మూయించాలని మమత ప్రయత్నం చేసింది. మమత తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌ను వదిలి, సువేందు బలమైన కోట అయిన నందిగ్రామ్ నుంచి పోటీ చేయడం ఒక పెద్ద రిస్క్. ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది.

అక్కడ జరిగిన పోరు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. చివరకు, సువేందు అధికారి స్వల్ప మెజారిటీతో మమతను ఓడించడం రాజకీయంగా పెద్ద సంచలనం. ఇది కేవలం ఓటమి కాదు—మమత నాయకత్వానికి సవాల్‌గా కూడా తయారయ్యింది. మమతకు సువెందో అధికారినే పెద్ద అడ్డుకట్టగా మారారు. శత్రు శిభిరంలో అన్ని తెలిసిన వ్యక్తికే బీజేపీ ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటి నుంచి బీజేపీ, టిఎంసీల నిప్పు ఉప్పలా పరిస్థితి తయారయ్యింది.

Read this article also : టీఎంసీ అభ్యర్థుల ఎంపిక: 74 మంది ఎమ్మెల్యేలపై వేటు.. కొత్త ముఖాలకు ఛాన్స్!

2026 భవానీపూర్ పోరు: రివర్స్ స్ట్రాటజీ

ఇప్పుడు 2026లో బీజేపీ మరోసారి అదే స్ట్రాటజీని మమతా బెనర్జీ మీద ప్రయోగిస్తోంది. ఈసారి మమత కంచుకోట అయిన భవానీపూర్‌లో సువేందును పోటీ చేయించి ఆమెను సవాల్ చేస్తున్నారు. ఇది సాధారణ పోటీ కాదు—ప్రతీకారం, ప్రతిష్ఠ, నాయకత్వ నిరూపణ అన్నీ కలిసిన పోరు. భవానీపూర్ మమతకు కేవలం నియోజకవర్గం కాదు, రాజకీయ గుర్తింపు. అలాంటి చోట ప్రత్యర్థి సవాల్ విసరడం, ఆమెపై ప్రత్యక్ష ఒత్తిడిని పెంచుతుంది.

మానసిక ఒత్తిడే: బీజేపీ వ్యూహం

బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. ఎలాగైనా పశ్చిమ బెంగాల్ ను గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్న బీజేపీ మమతను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి సిద్ధమవుతోంది.

ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షురాలు స్థాయిలో ఉన్న మమతను పరిమితం చేయడానికి భవానీపూర్‌లో బలమైన పోటీ ఉండాలని భావించారు. అందుకే అక్కడ నుంచి సువెందో అధికారిని రంగంలోకి దింపారు. దీంతో ఆమె ఎక్కువ సమయం అక్కడే వెచ్చించాల్సి వస్తుందని బీజేపీ ఆలోచన. దీనివలన ఇతర ప్రాంతాల్లో టీఎంసీ ప్రచారాన్ని బలహీనపరచే అవకాశం ఉంది.

“నీ గడ్డపైకి వచ్చి నిన్ను ఓడిస్తా” అనే సందేశం ఇవ్వడం, టీఎంసీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని వ్యూహం. అంటే ఇది ఓటింగ్ పోరు మాత్రమే కాదు—మానసిక యుద్ధం కూడా అవుతుంది.

ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది కంటే, ఈ పోరు బెంగాల్ రాజకీయాల దిశను ఎలా మార్చబోతుందన్నదే ముఖ్యమైన ప్రశ్న. ఒక విషయం మాత్రం స్పష్టం—భవానీపూర్ పోరు ఫలితం, మొత్తం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉంది.

English Summary:
The political rivalry between Mamata Banerjee and Suvendu Adhikari traces back to a 20-year mentor-disciple relationship that soured in 2020. Suvendu, the architect of the 2007 Nandigram movement that brought Mamata to power, spent 22 years in TMC before defecting to the BJP. After defeating Mamata in Nandigram in 2021 by a slim margin, Suvendu is now challenging her in her own bastion, Bhabanipur, for the 2026 elections. By fielding him in two seats, the BJP aims to restrict Mamata’s state-wide campaigning and project Suvendu as their primary CM face, setting the stage for a high-voltage psychological and electoral battle..

MamataBanerjee #SuvenduAdhikari #TMCvsBJP #WestBengalPolls #Bhabanipur #PoliticalHistory #AndhraPulse #DidiVsDada

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *