- బరితెగించిన బెల్టు షాపు నిర్వాహకులు
మద్యం దుకాణం ఎక్కడున్నా, బెల్ట్ షాపు మాత్రం ఏం మారుమూలనో జనసంచారం లేనచోటో ఊరు బయటను ఏర్పాటు చేసుకుంటారు. తాగాలనుకున్నవాడు తాగి ఊగాలనుకునేవారు అక్కడికి వచ్చి మద్యం కొనుక్కుని సేవిస్తుంటారు.
కానీ సంతలో మద్యం అమ్మేవారిని ఎక్కడైనా చూశారా? అది ఒక ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సంభోగం అయింది తణుకులోని ఓ సంతలో ఓ ప్రబుద్ధుడు నేరుగా పబ్లిక్ గానే మద్యం అమ్మేశాడు వివరాలు ఇలా ఉన్నాయి.
తణుకు : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాలు పోయి ప్రైవేటు దుకాణాలు వచ్చిన సంగతి తెలిసిందే. పోటీపడి దుకాణాలను మరి సాధించుకున్నారు.
కొన్ని ప్రాంతాల్లో.. ఇక ఎంత మద్యం ఎక్కువగా అమ్ముడైతే అంత లాభాలు ఉంటాయి వారికి. మద్యం అమ్మకాలను పోటీపడి మరి ప్రోత్సహిస్తున్నారు మద్యం దుకాణదారు.
ఈ క్రమంలో ఏ మాత్రం భయంలేకుండా బహిరంగంగా మద్యం బాటిళ్లు వరుసగా పేర్చి వ్యాపారం సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరిలోని పలు ప్రాంతాల్లో సంతలో కూరగాయలు, రోజువారీ సామాన్లను విక్రయించినట్లు బహిరంగంగానే అమ్మేస్తున్నారు.
రంగురంగుల బాటిల్స్ చూసిన వారికి తొలుత ఇదేంటో అర్ధం కాలేదు. కానీ ఇవన్నీ మద్యం బాటిల్సే అని అర్థమైనవారు షాక్ అయ్యారు. సంతలో ఇలా బహిరంగంగా అమ్మకాలు చేపట్టడంతో కొందరు యువకులు వీడియోలు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తణుకులోని పాతవూరు, సంత మార్కెట్, సజ్జాపురం, కోనాల, దువ్వ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. ఇక్కడ బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న వ్యక్తి మద్యాన్ని నేరుగా సొంతలోనే విక్రయిస్తున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఎక్సైజ్ వారి దృష్టికి వెళ్ళింది. ఆరి తీరి ఎక్సైజ్ వారు వచ్చే సమయానికి మద్యం విక్రయించే వ్యక్తి అక్కడ నుంచి జంప్ అయ్యాడు.
మద్యం దుకాణాల విచ్చలవిడితనం అప్పుడే మొదలైంది ఇది ముందు ముందు ఇంకెలా ఉంటుందో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో.