
- కుటుంబం నుండీ కూడా బష్కరించినట్లు ప్రకటన
బిహార్‌లో కీలక అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోని ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను ఆర్జేడీ నుండి ఆరు సంవత్సరాల పాటు బహిష్కరించినట్లు ప్రకటించారు. అంతటితో ఆగకుండా, కుటుంబ సభ్యత్వం నుండీ కూడా వెలివేసినట్లు స్పష్టం చేశారు.
“వ్యక్తిగత జీవితంలో నీతిమాలిన ప్రవర్తన సామాజిక న్యాయం కోసం సాగుతున్న తమ సాహస యాత్రను బలహీనపరుస్తుందని, పెద్ద కుమారుని ప్రవర్తన, ఆచరణ కుటుంబ పరంపరలకు విరుద్ధంగా ఉందని, అందుకే పార్టీకి, కుటుంబానికి అతడిని బహిష్కరిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లాలూ ప్రసాద్ పేర్కొన్నారు.
ఇకపై నుంచి అతడికి పార్టీతో కానీ, కుటుంబంతో కానీ ఏ విధమైన సంబంధమూ ఉండదని. అతడిని ఆరు సంవత్సరాలపాటు పార్టీ నుండి బహిష్కరించానని, తన వ్యక్తిగత జీవితంలో మంచి–చెడులను తానుగా గుర్తించగలగానని. అతడితో సంబంధాలున్నవారు తమ నిర్ణయాలను తామే తీసుకోవాలని కోరారు. ప్రజాజీవితంలో అపకీర్తి నుంచి విముక్తి కోసం తాను ఎప్పుడూ నడిచిన మార్గం ఇదేనన్నారు. తన కుటుంబంలోని శిష్టాచారంగలవారు దీన్ని పాటించారని చెప్పారు.