April 12, 2026

సనత్‌నగర్‌లో దారుణం: బండరాయితో మోది వ్యక్తి హత్య!

ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డు వద్ద కూలీల మధ్య గొడవ..

నిందితుడి కోసం పోలీసుల గాలింపు!

పగలంతా ఆడుతూ పాడుతూ పనిచేశారు… పది రూపాయలు సంపాదించుకున్నారు.. ఆ కష్టాన్ని మరచిపోవడానికి ముందు కొట్టారు.. వారిలో ఒకరు రిసెప్షన్ కోల్పోయి మరొకరి ని బండరాయితో మోది మోది చంపారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో జరిగే వివరాలు ఇలా ఉన్నాయి.

ఘటన వివరాలు:

​హైదరాబాద్‌ సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన నరేష్ (45), బిహార్ రాష్ట్రానికి చెందిన రోహిత్ కుమార్ (40) అనే ఇద్దరు వ్యక్తులు ఫతేనగర్ పైప్‌లైన్ రోడ్డు సమీపంలోని దుకాణాల్లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. వీరు అదే ప్రాంతంలో నివసిస్తుంటారు.

గొడవకు దారితీసిన మద్యం మత్తు:

శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:45 గంటల సమయంలో బుర్హాన్ ఇంజనీరింగ్ వర్క్‌షాప్ వద్ద ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో వారి మధ్య మాట మాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశానికి లోనైన రోహిత్ కుమార్, సమీపంలో ఉన్న ఒక భారీ బండరాయిని తీసుకుని నరేష్ తల, శరీరంపై పదేపదే బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

పోలీసుల దర్యాప్తు:

హత్య అనంతరం నిందితుడు రోహిత్ కుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *