
- రెండు సంస్థలు, 8 వేల ఉద్యోగాలు
చిత్తూరు జిల్లా కుప్పంలో పరిశ్రమల వెలుగు మెరుస్తోంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనలో మరోసారి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రెండు ప్రముఖ కంపెనీలకు భూమి కేటాయించి, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చర్యతో రాబోయే రోజుల్లో కుప్పం ప్రాంతం పారిశ్రామిక భూమిగా మారే అవకాశం కనిపిస్తోంది.
తాజాగా, శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కుప్పంలో పాల పరిశ్రమతో పాటు అనిమల్ ఫీడ్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. మరోవైపు, మదర్ డైరీ ఫలపండ్ల పప్పు ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థాపించనుంది. ఈ రెండు సంస్థలు కలిపి దాదాపు 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ మేరకు సోమవారం ‘X’లో పోస్టు చేసిన చంద్రబాబు… “శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మరియు మదర్ డైరీ ప్రతినిధులను కుప్పంలో కలిశాను. పేదిరకాన్ని అంతమొందించే వారి పెట్టుబడి ప్రణాళికలపై చర్చించాం. మా ‘స్వర్ణాంధ్ర’ లక్ష్యానికి అనుగుణంగా వారు పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు,” అని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా పల్లెల ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుందని సీఎం తెలిపారు. స్థానిక రైతుల నుంచి నేరుగా పాలు, పండ్ల తోటల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఈ పరిశ్రమలు పని చేస్తాయని వివరించారు.
ఇవి కుప్పం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (KADA)తో గడచిన కాలంలో చేసిన విస్తృత ఒప్పందాల్లో భాగంగా అభివృద్ధికి నాంది పలికే ప్రాజెక్టులని నాయుడు చెప్పారు.
ఇకపోతే… “ఈ పరిశ్రమల నిర్మాణం 15 నుంచి 18 నెలలలోపు పూర్తిచేయాలని నేను కంపెనీలను కోరాను,” అని కూడా సీఎం నాయుడు స్పష్టం చేశారు.