March 26, 2026

మానవత్వం చాటుకున్న కేటీఆర్

యాక్సిడెంట్ బాధితులను తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్‌కు తరలింపు

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. తన పర్యటన ముగించుకుని శుక్రవారం తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు.

మార్గమధ్యంలో సిరిసిల్ల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో జిల్లెల్ల వద్ద జరిగిన యాక్సిడెంట్‌ను గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తులను తన ఎస్కార్ట్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ యాక్సిడెంట్‌లో ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయనే అంబులెన్స్‌‌కు కాల్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వారిని హాస్పిటల్ ను వేగంగా తరలించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసిన పనిని పలువురు ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *