March 23, 2026

సోషలిజం కోసం చారిత్రాత్మక పోరాటం: గ్రీస్‌లో కెకెఇ 22వ మహాసభలు

గ్రీస్‌లోని గలాట్సీ ఒలింపిక్ హాల్‌లో బుధవారం ప్రారంభమైన గ్రీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (KKE) 22వ జాతీయ మహాసభలు శనివారం వరకు కొనసాగనున్నాయి. పార్టీ బలోపేతం మరియు భవిష్యత్తు కార్యాచరణపై ఈ సభలో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి.

పార్టీ ప్రధాన కార్యదర్శి డిమిత్రిస్‌ కౌత్సౌంబాస్‌ సెంట్రల్ కమిటీ నివేదికను ప్రవేశపెడుతూ ఉత్తేజిత ప్రసంగం చేశారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్తలు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ ఆధారంగా ప్రదర్శించిన ‘ది మేనిఫెస్టో’ నాటకం అందరినీ ఆకట్టుకుంది. రాజకీయ రంగంతో పాటు సాహిత్యం, కళలు, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ప్రారంభ వేడుకకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక సంక్షోభాలు ముదురుతున్నాయని, “ప్రపంచం కాలిపోతోంది, మన చుట్టూ తుఫానులు చెలరేగుతున్నాయి” అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కెకెఇ ప్రజల్లో లోతుగా పాతుకుపోయిందని, విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో ఎదురయ్యే ప్రశ్నలకు సోషలిజమే సరైన సమాధానం అని, ప్రతి సవాలును ఎదుర్కొని పార్టీ మరింత శక్తివంతంగా మారుతుందని ఉద్ఘాటించారు.

శనివారం ఈ మహాసభలు ముగియనున్నాయి. ముగింపు రోజున కొత్త కేంద్ర కమిటీ ఎన్నిక. కేంద్ర ఆడిట్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది.
#KKE #Socialism #CommunistParty #Greece #InternationalPolitics #Marxism #RedFlag #TeluguNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *