చిన్న చిత్రాల్లో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది: ‘Thimmarajupalli TV Movie’ ప్రీ రిలీజ్ ఈవెంట్!
TIMMARAJU PALLI TV
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం Thimmarajupalli TV Movie. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సాయి తేజ్, వేద జలంధర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ వి.మునిరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ తమ ఉత్సాహాన్ని పంచుకుంది.
నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తన టీమ్ అంతా అద్భుతమైన పనితీరు కనబరిచారని, చిన్న సినిమాల్లో ఈ చిత్రం ఒక సరికొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. దర్శకత్వానికే కాకుండా కొత్త నటీనటుల ప్రతిభకు ఈ సినిమా ఒక మంచి వేదిక అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేఏ ప్రొడక్షన్స్ సీఈవో రహస్య కిరణ్ మాట్లాడుతూ, నేటి జనరేషన్ పిల్లలకు పాత గ్రామీణ సంప్రదాయాలు, ఆ కాలం నాటి కల్చర్ తెలియదని, మా సినిమా చూస్తే ఆ వాతావరణాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు.
దర్శకుడి భావోద్వేగం
దర్శకుడు వి.మునిరాజు మాట్లాడుతూ.. కిరణ్ అబ్బవరం ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైందని భావోద్వేగానికి గురయ్యారు. ఏప్రిల్ 17న సినిమా విడుదలయ్యాక తన కుటుంబం గర్వపడేలా చేస్తానని, ప్రేక్షకులు ఖచ్చితంగా ఈ విలేజ్ డ్రామాను ఆదరిస్తారని కోరారు. ఈ చిత్రంలో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమ మేధస్సును ప్రదర్శించారని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు Thimmarajupalli TV Movie ఒక మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.
News Article (English)
Hero Kiran Abbavaram, known for encouraging fresh talent, has produced the upcoming periodic village drama Thimmarajupalli TV Movie under his KA Productions banner in association with Sumaira Studios. Starring debutants Sai Tej and Veda Jalandhar, the film is directed by V. Muniraju. The makers held a grand pre-release event ahead of its theatrical release on April 17th.
Producer Kiran Abbavaram expressed immense confidence in the project, stating that the film would set a new benchmark among small-budget movies. “The team has put in extraordinary effort, and I will speak more about their talent after the release on the 17th,” he said. Rahasya Kiran, CEO of KA Productions, added that the movie beautifully captures the village traditions and atmosphere of a bygone era, which will be a unique experience for the current ‘Gen Z’ audience.
A Heartfelt Journey
Director V. Muniraju shared an emotional note, thanking Kiran Abbavaram for his unwavering support since the days of ‘Meter’. He promised that Thimmarajupalli TV Movie would make his family and the entire team proud once it hits the screens. Business Head of ETV Win, Sai Krishna, also lauded Kiran’s courage to back a film with entirely new faces. With high expectations on its periodic setting and soulful storytelling, the movie is all set to charm the audience this weekend.
#ThimmarajupalliTVMovie #KiranAbbavaram #KAProductions #RahasyaKiran #NewTalent #TeluguCinema #VillageDrama #TollywoodNews #April17Release #ThimmarajupalliTV #MoviePreRelease

Experienced sub-editor with a proven track record in major publications, specializing in sharp analytical pieces and deep-dive investigative journalism.
