May 3, 2026

తప్పు చేస్తే కేసీఆర్‌ని మళ్లీ కూడా విమర్శిస్తాను – కవిత

kavitha

బిఆర్ఎస్ మాజీ నాయకురాలు Kavitha (తెలంగాణ రక్షణ సేన – టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు) శనివారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ గారితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని, కేవలం సిద్ధాంతపరమైన విబేధాలు మాత్రమే ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నీటి వినియోగంలో మరియు ఉపాధి కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వినియోగించుకుని ఉంటే తెలంగాణ రైతులకు ₹2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ ప్రభుత్వం ₹1.21 లక్షల కోట్లు ఖర్చు చేసి కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చిందని విమర్శించారు.

ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వంపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొప్ప ఐటీ మంత్రిగా పేరున్న కేటీఆర్ ఉండగా పేపర్ లీక్ ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. దీని వల్ల తెలంగాణలో రెండు జనరేషన్ల యువత నష్టపోయారని, ప్రభుత్వ ఉద్యోగం రాక ఎంతో మంది జీవితాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ “లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్” నష్టం అంతా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందని, అందుకే తాను కేసీఆర్ గారిని విమర్శించానని, తప్పు చేస్తే భవిష్యత్తులో కూడా విమర్శిస్తానని Kavitha తేల్చి చెప్పారు.

కొత్త పార్టీ వ్యూహాలు మరియు సామాజిక న్యాయం

తమ పార్టీ పేరు విషయంలో ఎన్నో కుట్రలు జరిగాయని, వాటిని ఎదుర్కోవడానికే వ్యూహాత్మకంగా చాలా పేర్లు ప్రచారం చేశామని ఆమె వివరించారు. తాను మూడో ప్రాధాన్యతగా పెట్టిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) అనే పేరునే ఎలక్షన్ కమిషన్ కేటాయించడం దైవ నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, బీజేపీ సామాజిక న్యాయానికి విరోధి అని ఆమె విమర్శించారు. తన పార్టీలో మహిళలకు 33 శాతం నుండి 50 శాతం వరకు సీట్లు కేటాయిస్తానని, ఇందిరా గాంధీ, జయలలిత వంటి నేతల స్ఫూర్తితో మహిళలు సమర్థవంతంగా పార్టీని నడపగలరని నిరూపిస్తామని Kavitha ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాను అంతర్గత వేదికల్లో ఫిర్యాదులు చేసినా బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లలేకపోయానని ఆమె ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఉద్యోమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో గట్టిగా వాయిస్ వినిపించనందుకు బహిరంగ క్షమాపణ కోరారు. తమ పార్టీ ‘పాంచజన్యం’ అనే ఐదు అంశాలతో ‘సర్వోదయ తెలంగాణ’ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తుందని చెప్పారు. విద్య, వైద్యంపై పెట్టే ఖర్చు సామాన్యుడికి భారం కాకుండా చూస్తామని, వినోభా భావే మరియు గాంధీ స్ఫూర్తితో సామాజిక న్యాయం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పనిచేస్తామని ఆమె వెల్లడించారు.


English Version

TRS (Telangana Rakshana Sena) Chief Kavitha launched a sharp critique against KCR and the BRS government during a ‘Meet the Press’ event. She clarified that her differences with KCR are purely ideological and centered on the loss of opportunities for Telangana. She alleged that the government wasted ₹1.21 lakh crore on projects providing water to only one lakh acres, while proper utilization of Krishna and Godavari waters could have earned farmers ₹2.5 lakh crore.

Kavitha also slammed the government over frequent paper leaks, questioning the efficiency of IT Minister KTR. She expressed regret for not being louder about the plight of martyrs’ families during her time in BRS and offered an apology. Her new party aims for a “Sarvodaya Telangana” with a 33% to 50% reservation for women in candidate selection, inspired by leaders like Indira Gandhi and Jayalalithaa. She emphasized that her fight is against injustice and for social development.

#Kavitha #TelanganaPolitics #KCR #BRS #TRS #PaperLeak #TelanganaRakshana Sena #WomensReservation #SocialJustice #BreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *