కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్, మాజీ సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విచారించింది. ఇది విచారణలో కీలక మలుపుగా మారింది.
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ముగిసింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ one-to-one questioning సుమారు 50 నిమిషాలు కొనసాగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సభ్యులు కేసీఆర్‌ను పలువురు కీలక అంశాలపై ప్రశ్నించారు. విచారణ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కి బయలుదేరారు. బీఆర్‌కే భవన్ ముందు కారులో నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.
విచారణకు సంబంధించి కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురికే ప్రవేశం కల్పించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాల్ బయటే నిలిపివేయబడ్డారు. కమిషన్ కార్యదర్శి మురళీధర్‌తో కలిసి జస్టిస్ ఘోష్, కేసీఆర్‌ను ప్రశ్నించారు.
బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరైన రెండో మాజీ సీఎంగా కేసీఆర్ చరిత్రలో నిలిచారు. గతంలో దివంగత సీఎం ఎన్టీఆర్ ఇదే భవన్‌లో న్యాయ విచారణ ఎదుర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్య కారణాలను చూపిస్తూ బహిరంగ విచారణ కంటే personal interaction కోరారు. ఆయన అభ్యర్థనను అంగీకరించిన కమిషన్, మొత్తం 9 మందికి మాత్రమే లోపలికి అనుమతించింది. చివర్లో హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మధుసూదనాచారి వంటి ప్రముఖ నేతలు కూడా హాజరయ్యారు.
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో కాకుండా ఎక్కడైనా నిర్మించివుంటే కేసీఆర్‌కు జాతీయ గుర్తింపు దక్కేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని రాజకీయ కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కమిషన్ విచారణతో నిజాలు బయటపడతాయన్నారు.
ఇక కేసీఆర్ విచారణతో కాళేశ్వరం కమీషన్ విచారణ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 114 మందిని విచారించిన కమిషన్, కేసీఆర్‌తో కలిపి 115 మందిని పరిశీలించింది. జులై చివరినాటికి కమీషన్ తుది నివేదిక సమర్పించే అవకాశముంది. విచారణ సందర్భంగా ఎంఎల్సీ కవిత–కేసీఆర్ మధ్య ముఖాముఖీ భేటీ జరగడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది.
Doctorate in Journalism with 29 years of hands-on experience in print, electronic, and digital media, alongside sustained academic engagement as a postgraduate instructor in journalism and communication studies.