
- పొగాకు రైతుల కోసం పోరాటానికి సిద్ధం అంటున్న జగన్
- రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
పొదిలి, జూన్ 11 : ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డును సందర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కనీస మద్దతు ధర ఇవ్వకపోతే రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రత్యేకంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోలు లేక మద్దతు ధరలు పడిపోవడం వల్ల వారి జీవితం తీవ్రంగా దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు.
రైతు ఆత్మహత్యలు – పాలకుల నిస్సహాయత
ప్రస్తుతం ఏపీ రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులే రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎంత క్షీణించిందనే దానికి నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో ఇటీవలే ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. వరి, మిర్చి, పత్తి, జోన్న, కంది, మొక్కజొన్న, పొగాకు వంటి పంటలకు కనీస ధర కూడా అందడం లేదన్నారు. గతంలో తమ పాలనలో రైతులకు నష్టపోయినా నష్ట పరిహారం అందించామని, కానీ ఇప్పుడు ఉచిత భీమా, ఈక్రాప్, రైతు భరోసా కేంద్రాలనుఅన్నింటినీ గాలికి వదిలేశారని ఆరోపించారు.
వైఎస్సార్ పాలనలో గౌరవంగా ఉన్న రైతన్న.. ఇప్పుడు అసహాయం
2023లో మా ప్రభుత్వం చివరి సంవత్సరం అయినా, వర్జీనియా Tobacco కి కిలో రూ.360 చెల్లించాం. కానీ ఈ రోజు హైగ్రేడ్ ధర రూ.240ని కూడా అందడం లేదు. Low-grade tobaccoకి కొనుగోలుదారులే లేరు”. కనీస ధర లేకపోవడం, కొనుగోలు కేంద్రాల తక్కువగా ఉండడం వల్ల రైతులు పంటను వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో Market Interventions, Auction Support ద్వారా రైతులకు ధర లభించేదని గుర్తు చేశారు.
వైఎస్సార్ హయాంలో రైతులకు స్వర్ణయుగం
2020లో MARKFED ని రంగంలోకి దింపి రూ.140 కోట్లు ఖర్చు చేసి రైతులకు గిట్టుబాటు ధరలు పొందేలా చేసామని తెలిపారు. ఇప్పుడు వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురవుతోందని అన్నారు. కేంద్రం ఇచ్చే PM-KISAN ₹6000 మినహా చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చే ₹20000 మాయమైపోయిందని ఆరోపించారు. “రైతన్న భయపడకుండా సాగు చేసుకునే వ్యవస్థను మేము ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు వ్యవసాయం దండగగా మారింది” అని వ్యాఖ్యానించారు జగన్.
జగనన్న రాకతో జనసంద్రంగా మారిన పొదిలి
పొదిలి పొగాకు బోర్డును సందర్శించి.. పోగాకు బేళ్లను పరిశీలించిన వైయస్ జగన్ గారు
పొగాకు ధరల వివరాలపై అధికారులను ఆరా తీసి.. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోంది? అంటూ నిలదీత
రైతులతో ముఖాముఖిలో మాట్లాడి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న వైయస్ జగన్… pic.twitter.com/rqhb5XReXX
— YSR Congress Party (@YSRCParty) June 11, 2025