
మైనింగ్ అక్రమాల ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆదివారం నెల్లూరు జిల్లా మాజీ మంత్రి కాకాణి గోవర్థన రెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
వైఎస్సార్సీపీ నాయకుల అరెస్టులో భాగంగా మరో నాయకుడిని అరెస్టు చేసింది.చంద్రబాబు ఆద్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రెండు నెలలుగా పోలీసుల ఆయనపై రకరకాల కేసులు బనాయిస్తున్నారు. అయితే ఆయన కూడా బెయిల్ తెచ్చుకోవడానికి కోర్టు మెట్లు తొక్కుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకాణి గోవర్థన రెడ్డి పలుమార్లు విమర్శలకు దిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అక్రమ మైనింగుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చేశారు. దీనిని ఏమాత్రం అరిగించుకోలేకపోయిన ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.
అదే అక్రమ మైనింగుకు పాల్పడ్డారని, లైసెన్సు గడువు ముగిపోయినా మైనింగు చేశారని ఆరోపిస్తూ కాకాణి గోవర్థన రెడ్డి కేసులు నమోదు చేశారు. చివరకు ఆదివారం ఆయనను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తీసుకు వస్తున్నారు.